- అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే లభ్యం
- కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీతో వచ్చిన రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్
టయోటా కంపెనీ మరో ఫెస్టివ్ ఎడిషన్ వెర్షన్ ని తీసుకువస్తుండగా, ఈసారి రూమియన్ కారు అదనపు ఫీచర్లతో స్పెషల్ ఎడిషన్ గా అందించబడింది. ఇంకా చెప్పాలంటే, ఈ నెల ప్రారంభంలో గ్లాంజా, అర్బన్ క్రూజర్ టైజర్, మరియు అర్బన్ క్రూజర్ హైరైడర్ కార్లలో చూసిన కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీని ఎంపివి కారు కూడా పొందింది.
కొత్త రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ కారు టయోటా జెన్యూన్ యాక్సెసరీ ప్యాకేజీ (టిజిఎ) ఫీచర్లతో రాగా, దీని ధర రూ.20,608 ఉండగా, కస్టమర్లు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ యాక్సెసరీ ప్యాకేజీని పొందవచ్చు. ఇందులో గుర్తించదగిన ముఖ్యమైన అంశాలలో మడ్ ఫ్లాప్స్, కార్పెట్ మ్యాట్స్, క్రోమ్ డోర్ వైజర్, మరియు రూఫ్ ఎడ్జ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. అలాగే టెయిల్ గేట్, రియర్ బంపర్, హెడ్ ల్యాంప్, నంబర్ ప్లేట్, మరియు బాడీ సైడ్ మౌల్డింగ్ వంటి వాటిపై గార్నిష్ ని కలిగి ఉంది.
టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు. అలాగే ఇది సిఎన్‍జి వెర్షన్లో కూడా అందించబడింది. కస్టమర్లు రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ కారును S, G, మరియు V అనే మూడు వేరియంట్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ మరియు సిఎన్‍జి వెర్షన్లలో ఈ కారు వరుసగా 20.51కెఎంపిఎల్ మరియు 26.11కెఎం/కేజీ మైలేజీని అందిస్తున్నట్లు టయోటా కంపెనీ పేర్కొంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్