- కేవలం సింగిల్ వేరియంట్లో అందించబడుతున్న రూమియన్
- రూ.11.39 లక్షలతో ధరలు ప్రారంభం
గత సంవత్సరం, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ దేశవ్యాప్తంగా రూమియన్ ఎంపివి సిఎన్‍జి వేరియంట్ బుకింగ్స్ నిలిపివేసింది. సిఎన్‍జి-స్పెక్ రూమియన్ ఏకైక S గ్రేడ్ వేరియంట్లో రూ. 11.39 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందించబడుతుంది. ఇప్పుడు, ఆటోమేకర్ రూమియన్ లో G అనే కొత్త ఆటోమేటిక్ వేరియంట్ ని పరిచయం చేస్తూ, వీటి బుకింగ్స్ ని తిరిగి ప్రారంభించింది.
ఈ అప్‍డేట్ ద్వారా, కస్టమర్లు టయోటా రూమియన్ ని S, G మరియు V అనే మూడు వేరియంట్లలో, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సులతో పెట్రోల్ మరియు సిఎన్‍జి ఆప్షన్లలో పొందవచ్చు. ఇది మారుతి సుజుకి ఎర్టిగాతో షేర్ చేసుకున్న 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటారుతో వచ్చింది. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి రాగా, ఇది 102bhp మరియు 136.8Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‍జి వెర్షన్ పరంగా చూస్తే, ఈ మోటార్ 87bhp పవర్ ని ఉత్పత్తి చేస్తుండగా, 26.11 కెఎం/కెజి ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.
ఇతర వార్తలలో చూస్తే, తాజాగా లాంచ్ అయిన టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ చేరుకోవడం ప్రారంభమైంది. ఈ క్రాస్ ఓవర్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో రూ.7.73 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్