- మొత్తంగా 25,220యూనిట్లుగా ఉన్న సేల్స్
- 61 శాతం వార్షిక వృద్ధిని సాధించిన టయోటా
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఫిబ్రవరి-2024లో 25,200 యూనిట్లను విక్రయించి 61 శాతం వార్షిక వృద్ధిని సాధించింది, గత సంవత్సరం ఇదే నెలలో టయోటా కంపెనీ కేవలం 15,685 యూనిట్లను మాత్రమే విక్రయించింది. వృద్ధి రేటు పరంగాటయోటాకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఫిబ్రవరిలో విక్రయించిన వాటిలో 23,300 యూనిట్లు దేశీయ కార్ సేల్స్ మరియు 1,920 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.
తాజాగా, ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా 50,000 యూనిట్ల మూడు-వరుసల ఎంపివి అయిన ఇన్నోవా హైక్రాస్ కార్లను విక్రయించి సరికొత్త మైల్ స్టోన్ ని క్రియేట్ చేసింది. ఈ థర్డ్ జనరేషన్ ఇన్నోవా 2022లో దేశవ్యాప్తంగా విక్రయానికి వచ్చింది మరియు ప్రస్తుతం ఉన్న మోడల్ తో పోల్చితే పెద్ద అప్ డేట్స్ ని అందుకుంది. ప్రస్తుతం, ఈ మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో 5 వేరియంట్లలో రూ. 19.77 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందించబడుతుంది.
సేల్స్ గురించి టయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, 'అందరికీ 'మాస్ హ్యాపీనెస్' అందించడానికి మరియు కస్టమర్-ఫస్ట్ విధానాన్ని కొనసాగించడంతో నెలవారీ వృద్ధిని కొనసాగిస్తున్నాము. ఈ నెలలో అత్యధిక నెలవారీ విక్రయాలను రిజిస్టర్ చేయడంతో, మేము అన్ని ప్రాంతాల నుండి మంచి కస్టమర్ ఎంక్వైరీలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌ను చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, ఫార్చూనర్ మరియు లెజెండర్ తమ లీడర్ షిప్ ని కొనసాగిస్తూ, మా వృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి, ప్రస్తుతం డిమాండ్ పెరుగుదలలో ఎస్‍యూవీ మరియు ఎంయూవీ మోడల్స్ ముందంజలో ఉన్నాయి. తాజాగా, ఇన్నోవా హైక్రాస్ నవంబర్ 2022లో లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించి అద్భుతమైన మైల్ స్టోన్ ని సృష్టించింది, కస్టమర్ల లైఫ్ స్టైల్ మరియు వారి అవసరాలకు సరిపోయే వాహనాన్ని అందించడంపై మా ఫోకస్ ఉంది” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్