- హైక్రాస్ ZX, ZX(O) వేరియంట్లపై పెరిగిన ధర
- అధిక డిమాండ్ కారణంగా 2023లో ఈ వేరియంట్లపై తాత్కాలికంగా నిలిపివేయబడ్డ బుకింగ్స్
టయోటా కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్ తీసుకు వచ్చాము. అది ఏంటి అంటే, టయోటా కిర్లోస్కర్ మోటార్ ఏప్రిల్-2024 నుండి ఇన్నోవా హైక్రాస్ ZX మరియు ZX(O) వేరియంట్ల బుకింగ్‌లను అధికారికంగా తిరిగి ప్రారంభించింది. గతంలో ఈ మోడల్ కి విపరీతమైన డిమాండ్ ఉండేది. అధిక డిమాండ్ కారణంగా ఏప్రిల్-2023లో టయోటా ఈ వేరియంట్లపై బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది.
ఆసక్తికలిగిన కస్టమర్లు ఇప్పుడు ఇన్నోవా హైక్రాస్ ZX మరియు ZX(O) వేరియంట్లను అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 50 వేలతో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ రెండు వేరియంట్లపై ధరలు రూ.30 వేలు పెరిగాయి. పెరిగిన ధరతో కలిపితే, హైక్రాస్ మోడల్ ZX మరియు ZX(O) వేరియంట్ల ధరలు వరుసగా Rs. 30.34 లక్షలుమరియురూ. 30.98 లక్షలుగా (రెండు ధరలు, ఎక్స్-షోరూం) ఉన్నాయి.
గత నెలలో, బ్రాండ్ నుంచి వచ్చిన ప్రతి మోడల్ పై సుమారుగా ఒక శాతం మేర ధరలను పెంచుతున్నట్లు టయోటా వెల్లడించింది. ఇతర వార్తలలో చూస్తే, ప్రస్తుతం కొత్త GX(O) వేరియంట్‌పై టయోటా కసరత్తులు చేస్తోంది, ఇది త్వరలో లాంచ్ కాబోతోంది. ఈ వేరియంట్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మరియు పూర్తి వివరాలు ఇప్పటికే మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి వాటిని చదువగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్