- లేటెస్టుగా ప్రారంభమైన ZX మరియు ZX(O) వేరియంట్ల బుకింగ్స్
- ఆరు వేరియంట్లు మరియు ఏడు కలర్లలో అందించబడుతున్న హైక్రాస్ మోడల్
తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ ని తిరిగి ప్రారంభించింది. ఇంతకు ముందు ఈ కారుకు విపరీతమైన డిమాండ్ కొనసాగుతున్న కారణంగా, కార్ మేకర్ వీటి బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఇప్పుడు వాటిని పునరుద్దరిస్తూ, సరఫరాను మెరుగుపరచాలని నిశ్చయించి తిరిగి ZX మరియు ZX(O) వేరియంట్ల బుకింగ్స్ ని ప్రారంభించి, కస్టమర్లకు వీటిని అందుబాటులోకి తీసుకువస్తుంది.
దీనిని అనుసరిస్తూ, టయోటా హైక్రాస్ వెయిటింగ్ పీరియడ్ లో మార్పులు చేయగా, అది తక్షణమే అమలులోకి తీసుకువచ్చింది. ఆగస్టు-2024 నాటికి, ఇన్నోవా హైక్రాస్ మోడల్ పై ఒక సంవత్సరం పాటు వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ఇది హైబ్రిడ్ వేరియంట్లకు వర్తిస్తుంది. అదేవిధంగా, పెట్రోల్ వేరియంట్లపై 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. గతంలో ఉన్న వెయిటింగ్ పీరియడ్ తో పోలిస్తే, ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు.
ముఖ్యంగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్ 7-సీట్ మరియు 8-సీట్ కాన్ఫిగరేషన్లలో GX, GX (O), VX, VX (O), ZX, మరియు ZX(O) అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇంకా చెప్పాలంటే, ఈ కారును కస్టమర్లు సూపర్ వైట్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, సిల్వర్ మెటాలిక్, స్పార్క్లింగ్ బ్లాక్ పెర్ల్ క్రిస్టల్ షైన్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు బ్లాక్‌సిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్ అనే ఏడు కలర్లలో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్