- కేవలం పెట్రోల్ పవర్ ట్రెయిన్ లో రానున్న కొత్త టాప్-స్పెక్ వెర్షన్
- 7 మరియు 8-సీటర్ లేఅవుట్లో అందించబడే అవకాశం
కస్టమర్లు ఎంతగానో ఇష్టపడే మోస్ట్ పాపులర్ ఇన్నోవా హైక్రాస్ వేరియంట్ లిస్టును టయోటా ఇండియా అప్‍డేట్ చేసింది. మారుతి ఇన్విక్టో సరిసమానమైన ఈ మోడల్ ఇప్పుడు కేవలం పెట్రోల్ పవర్ ట్రెయిన్లో మాత్రమే కొత్త టాప్-స్పెక్ వేరియంట్ ని పొందింది. జపనీస్ ఆటోమేకర్ ఈ కొత్త వేరియంట్ ధరను ఇంకా ప్రకటించకపోయినా, ఏప్రిల్ మొదటి వారంలో దీనిని లాంచ్ చేయవచ్చని మేము భావిస్తున్నాము.
ఇప్పటివరకు ఇన్నోవా హైక్రాస్ లో GX వేరియంట్ టాప్-స్పెక్ వేరియంట్ గా ఉండేది, ఇప్పుడు దాని స్థానంలో కొత్త GX (O) వేరియంట్ వచ్చింది. GX వేరియంట్ తో పోలిస్తే, ఫీచర్స్ పరంగా ఇందులో పెద్ద 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, రియర్ సన్‌షేడ్, రియర్ డీఫాగర్, సాఫ్ట్-టచ్ డ్యాష్‌బోర్డ్‌తో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ మరియు ఎల్ఈడీఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. దీని గురించి ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు దీనిని 7-సీటర్ మరియు 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో పొందవచ్చు.
మెకానికల్ గా, ఇన్నోవా హైక్రాస్ 2.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటార్ మరియు 2.0-లీటర్ హైబ్రిన్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఇంకా త్వరలో రాబోయే వేరియంట్ కూడా సివిటి గేర్ బాక్సుతో 2.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటారును పొందనుంది. ఈ ఇంజిన్ 172bhp మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్