- రూ. 19.77లక్షలు ప్రారంభ ధరతో ఇప్పుడు ఇన్నోవా హైక్రాస్ లభ్యం
- అందుబాటులో ఉన్న4 వేరియంట్స్ మరియు 7 కలర్స్
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) జనవరి 2024 నుండి దాని ప్రోడక్ట్ రేంజ్ లోని సెలెక్టెడ్ మోడల్స్ పైధరలను పెంచింది. అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా మరియు ఇన్నోవా హైక్రాస్‌లతో సహా తన వివిధ మోడల్స్ పై ధరలను రూ. 42,000 వరకు పెంచింది. ఈ హైక్రాస్ మరియుక్రూజర్ హైరైడర్యొక్క అప్‌డేటెడ్ ధరల వివరాలను మనం పరిశీలిద్దాం.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంట్రీ-లెవల్ GX వేరియంట్ పై రూ. 10,000 వరకు ధరలు పెరిగాయి. గత ఏడాది ధరలతో పోలిస్తే ఎంపివి యొక్క అన్ని ఇతర వేరియంట్‌లపై ఇప్పుడు రూ.42,000 వరకు ప్రీమియం ధరలు పెరిగాయి. అదే విధంగా, ఈ బ్రాండ్ నుంచి వచ్చిన GX లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మాత్రం టయోటా తన లైనప్ నుంచి టయోటా తొలగించింది. ఇన్నోవా హైక్రాస్ పై రూ.42,000, అర్బన్ క్రూజర్ హైరైడర్ పై రూ. 28,000వరకు ధరలు పెరిగాయి.
ఈ ధరల పెంపును ఓసారి గమనిస్తే , టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర ఇప్పుడు రూ. 19.77 లక్షలతో, ప్రారంభమవుతుంది.అలాగే వివిధ వేరియంట్లను బట్టి టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 30.68 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ రెండు పవర్‌ట్రెయిన్‌లు మరియు 7 పెయింట్ ఆప్షన్స్ 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.అదే విధంగా, జి నియోడ్రైవ్, జి ఏటి నియోడ్రైవ్, వి నియోడ్రైవ్ మరియు వి ఏటి నియోడ్రైవ్, ధరలలో ఎటువంటి మార్పులు లేవు.
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్‌లకు ప్రత్యర్థిగా ఉన్న టయోటా హైరైడర్ 11కలర్స్, 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అదేవిధంగా, మూడు పవర్‌ట్రెయిన్‌లతో సిఎన్‍జి ఆప్షన్ లో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప