- ZX మరియు ZX(O) వేరియంట్ల బుకింగ్‌లను తిరిగి ప్రారంభించిన టయోటా
- త్వరలో కొత్త GX(O) వేరియంట్‌ను పొందే అవకాశం
గత నెలలో, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఏప్రిల్ 2024 నుండి అమలులోకి వచ్చే విధంగా తన మోడల్ రేంజ్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, ఎంపివి అప్‌డేట్ చేయబడిన ధరల లిస్ట్ ను మనం పరిశీలిద్దాం.
టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వెర్షన్స్ పై రూ. 30,000 వరకు ధరలను పెంచింది. ఇదిలా ఉండగా , VX మరియు VX(O) వేరియంట్స్ పై రూ. 25,000 వరకు ధరలు పెరిగాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే టాప్-స్పెక్ ZX మరియు ZX(O) వేరియంట్స్ ధరలురూ.30,000 వరకు పెరిగాయి.
అదే సమయంలో, టయోటా టికెఎం ఇన్నోవా హైక్రాస్ ZX మరియు ZX(O) వేరియంట్ల బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. అధిక డిమాండ్ కారణంగా బుకింగ్‌లను సుమారు ఏడాది క్రితం నిలిపివేశారు. హైక్రాస్ మోడల్ ని మరింత మెరుగుపరచడానికి, ఆటోమేకర్ రాబోయే వారాల్లో ఎంపివిలో కొత్త GX(O) వేరియంట్‌లను కూడా పరిచయం చేయబోతుంది.
వేరియంట్ వారీ టయోటా ఇన్నోవా హైక్రాస్ అప్‌డేట్ చేసిన (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | పాత ధరలు | కొత్త ధరలు |
VX హైబ్రిడ్7S | రూ. 25.72 లక్షలు | రూ. 25.97 లక్షలు |
VX హైబ్రిడ్ 8S | రూ. 25.77 లక్షలు | రూ. 26.02 లక్షలు |
VX(O) హైబ్రిడ్ 7S | రూ. 25.69 లక్షలు | రూ. 27.94 లక్షలు |
VX(O) హైబ్రిడ్ 8S | రూ. 25.74 లక్షలు | రూ. 27.99 లక్షలు |
ZX హైబ్రిడ్ 7S | రూ. 25.04 లక్షలు | రూ. 30.34 లక్షలు |
ZX(O) హైబ్రిడ్ 7S | రూ. 25.68 లక్షలు | రూ. 30.98 లక్షలు |