- 7- సీట్ మరియు 8-సీట్ లేఅవుట్‌లలో లభ్యం
- 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా వచ్చిన హైక్రాస్ మోడల్
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇన్నోవా హైక్రాస్ రేంజ్ లోకి GX(O) అనే కొత్త వేరియంట్‌ను పరిచయం చేస్తూ, దీనిని ధర రూ. 20.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో నేడే లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఈ వేరియంట్ కోసం బుకింగ్స్ కూడా కొనసాగుతుండగా, వీటి డెలివరీ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే, కొత్త ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్‌లో ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ డీఫాగర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే మరియు 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది చెస్ట్‌నట్ ఇంటీరియర్ థీమ్, డాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌లపై సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ మరియు రియర్ సన్‌షేడ్‌లతో అమర్చబడి ఉంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్ 7 కలర్లలో అందించబడింది, అవి ఏవి అంటే, బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్, ప్లాటినం వైట్ పెర్ల్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, స్పార్క్లింగ్ బ్లాక్ పెర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ మరియు అవాంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్. కస్టమర్లు దీనిని 7- సీట్ మరియు 8- సీట్ లేఅవుట్‌లలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
హుడ్ కింద, 2024 ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్ 2.0-లీటర్, 4-సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ మోటారు సివిటి ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి వచ్చింది. ఈ ఇంజన్ 172bhp పవర్ మరియు 188Nm టార్క్ అవుట్‌పుట్ ను అందిస్తుంది.
ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్ యొక్క వేరియంట్-వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ధర |
హైక్రాస్ పెట్రోల్ GX(O) 8S | రూ. 20.99 లక్షలు |
హైక్రాస్ పెట్రోల్ GX(O) 7S | రూ.21.13 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్