- లాంచ్ అయిన 14నెలల్లోనేమైలురాయిని సాధించిన మోడల్
- ఇండియాలో రూ. 19.77 లక్షల (ఎక్స్-షోరూమ్)తో ఇన్నోవా హైక్రాస్ ధరలు ప్రారంభం
నవంబర్ 2022లో ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఇన్నోవా హైక్రాస్ 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. ఈ మోడల్ ఇండియాలో అమ్మకానికి వచ్చిన 14 నెలల్లోనే ఈ మైలురాయిని సాధించింది. టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (టిఎన్ జిఎ) ఆధారంగా, హైక్రాస్ ముందున్న దాని మోడల్ కంటే కొత్త జనరేషనల్ మార్పును పొందింది. అలాగే, బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణానికి బదులుగా మోనోకోక్ ఛాసిస్‌ను కూడా పొందింది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ 5 వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ఈ మోడల్ ధరలు రూ. 19.77 లక్షల నుండి ప్రారంభమై రూ. 30.68 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి. ప్రస్తుతం, మహీంద్రా ఎక్స్‌యువి700 కి పోటీగా ఉన్న ఈ ఇన్నోవా హైక్రాస్ ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దీనిని బుకింగ్ చేసుకున్న రోజు నుండి 52 వారాల వరకు వేచి ఉండవలసి ఉంటుంది.
అంతేకాకుండా, దీని కార్ మేకర్ఈ మూడు-వరుసల ఎంపివి యొక్క ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్‌పై కూడా తన పనిని కొనసాగిస్తుండగా, ఈ వెర్షన్‌ను ఇటీవలే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. అదే విధంగా పెర్ఫార్మెన్స్ అవుట్‌పుట్‌తో అదే 2.0-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ గ్యాసోలిన్ ఇంజిన్‌ను ఉపయోగించి 80 శాతం వరకు ఇథనాల్- మిశ్రమాన్ని ఉపయోగించడానికి ఈ మోడల్‌ను గ్యాసోలిన్‌పై నడపవచ్చని దీని బ్రాండ్ పేర్కొంది.
ఈ విజయంపై టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, “ఇన్నోవా హైక్రాస్ లాంచ్ అయిన 14 నెలలోనే అతి తక్కువ సమయంలో 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించడం మాకు చాలా ఆనందంగా ఉందని, ఈ ఉత్పత్తిపై మా కస్టమర్‌లు అందించిన ప్రతిస్పందన మరియు నమ్మకానికి మేము చాలా కృతజ్ఞులం అని ఇన్నోవా హైక్రాస్ లాంచ్ చేసిన రోజు నుండి విజయవంతమై, ఈ ఉత్పత్తి మా లక్ష్య ప్రేక్షకుల నుండి నమ్మకమైన కస్టమర్ల ఆమోదాన్ని పొందిందని, దీని లాంచ్ తో, ఇన్నోవా హైక్రాస్ ఎంయువి సెగ్మెంట్‌లో ప్రతి కుటుంబ ప్రయాణాన్ని అత్యంత సౌకర్యంగా మరియు పెర్ఫార్మెన్స్, సేఫ్టీగా ఉండేలా ఆలోచనను మార్చింది. అంతేకాకుండా, ఇన్నోవా బ్రాండ్ యొక్క హైక్రాస్ ను మరింత ముందుకు తీసుకువెళుతున్నందుకు ఇన్నోవా హైక్రాస్ గురించి మేము చాలా గర్వపడుతున్నానని అలాగే, హైక్రాస్ కస్టమర్ల నుండి అభిమానాన్ని పొందడం కొనసాగిస్తుందని మరియు దాని అసాధారణమైన పెర్ఫార్మెన్స్ ద్వారా ఏకరీతిగా అనుభవాన్ని స్థిరంగా పొందుతుందని మేము విశ్వసిస్తున్నాము ”అని తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప