- మరిన్ని మెరుగైన ఫీచర్లతో వచ్చిన కొత్త మిడ్-స్పెక్ వేరియంట్
- కేవలం డీజిల్ ఇంజిన్ తో మాత్రమే లభ్యం
ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టాలో ఇతర వేరియంట్లు ఉండగా, ఇప్పుడు టయోటా వాటి వేరియంట్ల సంఖ్యను పెంచుతూ GX ప్లస్ అనే కొత్త వేరియంట్ ని రూ. 21.39 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ చేసింది. GX వేరియంట్ తో పోలిస్తే GX ప్లస్ వేరియంట్ 14 అదనపు ఫీచర్లను కలిగి ఉండడంతో, దీని ధర 1.3 లక్షలు అధికంగా ఉంది.
ఇప్పుడు కొత్త GX ప్లస్ వేరియంట్ లోని కొన్ని బెస్ట్ హైలైట్ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి:
రియర్ కెమెరా
ఆటో-ఫోల్డ్ మిర్రర్స్
డివిఆర్
డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
వుడెన్ ప్యానెల్స్
ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్స్
కలర్లు మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్లు
ఈ కొత్త వేరియంట్ ని 7 మరియు 8-సీటర్ ఆప్షన్లలో, సూపర్ వైట్ ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు సిల్వర్ మెటాలిక్ అనే 5 కలర్లలో పొందవచ్చు. ఈ వేరియంట్ యొక్క టయోటా 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి 148bhp/343Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అధికారిక ప్రకటన
టయోటా కిర్లోస్కర్ మోటార్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, శబరి మనోహర్ లాంచ్ గురించి స్పందిస్తూ, “2005లో ఇన్నోవా బ్రాండ్ లాంచ్ అయినప్పటి నుండి ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ సెగ్మెంట్ లీడర్‌గా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మెరుగైన ఖ్యాతిని పొందింది. క్వాలిటీ మరియు విశ్వాసానికి ప్రతీకగా, ఇన్నోవా వివిధ జనరేషన్ల నుంచి ఇండియన్స్ అభిరుచులకు అనుగుణంగా కార్లను అప్ డేట్ చేస్తూనే ఉంది. అదే నమ్మకాన్ని చూరగొని బెస్ట్ గా నిలిచింది. మా కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, కస్టమర్ ట్రెండ్స్ ఆధారంగా బ్రాండ్‌ను రిలేటెడ్ గా మరియు మల్టీ-ఫంక్షనల్‌గా ఉంచడమే టికెఎం ప్రయత్నం” అని చెప్పుకొచ్చారు.
వేరియంట్-వారీగా టయోటా ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:
ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ 7 సీటర్ – రూ.21.39 లక్షలు
ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ 8 సీటర్ – రూ. 21.44 లక్షలు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్