- ఇండియాలో రూ.10.29 లక్షలతో ప్రారంభంకానున్న రూమియన్ ధరలు
- ఇండియాలో రూ.6.81 లక్షలతో ప్రారంభంకానున్న గ్లాంజా ధరలు
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) నవంబర్-2023లో తమ మోడల్స్ కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్టికల్ లో మనం టయోటా నుంచి వచ్చిన రూమియన్, గ్లాంజా, హైలక్స్ మరియు వివిధ మోడల్స్ కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ టైంలైన్ వివరాలను తెలుసుకోబోతున్నాము.
టయోటా రూమియన్
ఈ నెలలో టయోటా రూమియన్ సిఎన్జి వేరియంట్స్ పై 13 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది, అక్టోబర్ నెలలో ఉన్న 16 నెలల వెయిటింగ్ పీరియడ్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. మరోవైపు, పెట్రోల్ వేరియంట్స్ ను బుక్ చేసుకున్న కస్టమర్లు బుకింగ్ చేసిన తేదీ నుంచి 6 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మోడల్ S, G మరియు V అనే 3 వేరియంట్స్ లో, రస్టిక్ బ్రౌన్, ఐకానిక్ గ్రే, స్పంకీ బ్లూ, కేఫ్ వైట్, మరియు ఎంటైసింగ్ సిల్వర్ అనే 5 కలర్స్ లో అందుబాటులో ఉంది.
టయోటా గ్లాంజా
మేము చెబుతున్న వెయిటింగ్ పీరియడ్ వరుసలో టయోటా గ్లాంజా కూడా ఉంది. నవంబర్-2023లో టయోటా గ్లాంజాలోని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్స్ పై స్టాండర్డ్ గా ఒక నెల లేదా 4 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ప్రస్తుతం ఈ మోడల్ E, S, G మరియు V అనే 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
టయోటా హైలక్స్
ప్రస్తుతం, నవంబర్-2023లో టయోటా హైలక్స్ పై స్టాండర్డ్ గా ఒక నెల లేదా 4 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ హైలక్స్ లోని అన్నీ వేరియంట్స్ పై ఈ నెల చివరి వరకు కొనసాగనుంది. గత మార్చి నెలలో ఇదే మోడల్ పై సుమారుగా రూ.3.60 లక్షలు (ఎక్స్-షోరూం) తగ్గింది. ప్రస్తుతం, ఈ పికప్ వెహికిల్ స్టాండర్డ్ MT, హై MT మరియు హై AT అనే 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్