- సర్టిఫికేషన్ టెస్ట్ సమయంలో రిపోర్టులో హెచ్చుతగ్గులను కలిగి ఉన్న డీజిల్‌తో నడిచే టయోటా కార్లు
- ఈ మోడళ్లపై బుకింగ్‌లను కొనసాగించనున్న కంపెనీ
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) యొక్క లైనప్ నుండి సెలెక్ట్ చేసిన డీజిల్-పవర్డ్ మోడళ్ల డెలివరీని ప్రస్తుతానికి నిలిపివేసింది. దీని ప్రభావం హిలక్స్, ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చూనర్ కార్లపై పడింది.
కార్‌మేకర్ ప్రకారంగా, టయోటా మోటార్ కార్పొరేషన్ (టిఎంసి)కి దగ్గర ఉన్న టయోటా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (టిఐసిఓ), హార్స్‌పవర్ అవుట్‌పుట్ సర్టిఫికేషన్ టెస్ట్లో మూడు డీజిల్ ఇంజిన్ మోడళ్లలో హెచ్చుతగ్గులను కనుగొన్నట్టు ప్రకటించింది. ఈ హెచ్చుతగ్గులు పవర్ మరియు టార్క్ మలుపు సున్నితంగా మార్చడానికి సంబంధించినవి కానీ, పవర్‌ట్రెయిన్-సంబంధిత విలువలపై ఎటువంటి అతిగా లేదా ఎక్కువ -క్లెయిమ్‌లకు దారితీయలేదు.
సర్టిఫికేషన్ కోసం ఉపయోగించిన వెహికిల్స్ డేటాను నిర్ధారించడానికి టయోటా సంబంధిత అథారిటీలతో కలిసి పని చేస్తుందని చెప్పవచ్చు. పైన పేర్కొన్న ఎఫెక్ట్ వెహికల్స్ ను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ, ఈ బ్రాండ్ కొత్త ఆర్డర్‌లను అంగీకరిస్తుంది. ఇక కార్ల విషయానికి వస్తే, ఇప్పటికే పంపబడిన కార్లు , కస్టమర్‌కు ఇంకా డెలివరీ చేయకపోతే, వారికి వాటి కండీషన్ గురించి వివరించి, నిర్థారణ తర్వాత మాత్రమే పేర్కొన్న వెహికల్స్ నురిజిస్టర్ చేసి డెలివరీ చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప