- కాస్మెటిక్ మార్పులతో లాంచ్ అయిన స్పెషల్ ఎడిషన్
- మోడల్ లో స్టాండర్డ్‌గా లభిస్తున్న బిఎండబ్లూ డ్రైవింగ్ అసిస్టెన్స్
బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇటీవలే షాడో ఎడిషన్ పేరుతో X3 ఎస్‌యువిలలో స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీనిని రూ. 74.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే, ఇది ఎక్స్‌డ్రైవ్20d M స్పోర్ట్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది, ఇక్కడ మేము ఈ స్పెషల్ ఎడిషన్ లో టాప్-6 హైలైట్స్ ను మీకు అందిస్తున్నాము, ఇది స్టాండర్డ్ ఎస్‌యువి కంటే రూ.1.4 లక్షలు ఖరీదైనది.
బ్లాక్డ్ అవుట్ ఎలిమెంట్స్
న్యూ X3 షాడో ఎడిషన్ కిడ్నీ గ్రిల్, విండో సరౌండ్స్, రూఫ్ రెయిల్స్ మరియు టెయిల్‌పైప్స్ వంటి అనేక బ్లాక్-అవుట్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్‌లను పొందింది.
ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్స్
ఈ లిమిటెడ్ ఎడిషన్ M కార్బన్ బ్లాక్ మరియు M బ్రూక్లిన్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
బ్లాక్ ఎడిషన్ ప్యాకేజ్
అలాగే, బ్లాక్ ఎడిషన్ ప్యాకేజ్ తో సహా కస్టమర్‌లుమరో రెండు ప్రత్యేక ప్యాకేజ్ ఆఫర్‌లలో దీనిని ఎంచుకోవచ్చు. ఇది బ్లాక్ రియర్ స్పాయిలర్, M సైడ్ స్ట్రిప్ మరియు M సైడ్ లోగోను పొంది ఉంటుంది.
కార్బన్ ఎడిషన్ ప్యాకేజ్
కొనుగోలుదారులు ఎంచుకోగల మరొక ప్యాకేజ్ లో కొన్ని అదనపు అంశాలతో కూడిన కార్బన్ ఎడిషన్ ప్యాకేజీని పొందవచ్చు. అలాగే, పైన పేర్కొన్నఅంశాలుకాకుండా, గేర్ లివర్ మరియు ఎంట్రీ సిల్ కార్బన్ ఫైబర్‌తో వంటి వాటితో పూర్తి చేయబడ్డాయి.
అప్హోల్స్టరీ రెండు రకాలు
లోపలి భాగంలో, బిఎండబ్లూ X3 M స్పోర్ట్ షాడో ఎడిషన్ లుక్ మరియు చక్కటి అనుభూతిని పెంచే లెదర్ వెర్నాస్కా అప్హోల్స్టరీని కలిగి ఉంది. దీనిని M స్టిచింగ్‌తో మోచా మరియు బ్లాక్ వంటి రెండు షేడ్స్‌లో పొందవచ్చు.
ఏడీఏఎస్(ఎడాస్) స్టాండర్డ్
స్టాండర్డ్ X3 ఎక్స్‌డ్రైవ్20d M స్పోర్ట్‌లోని ఫీచర్లతో పాటు, షాడో ఎడిషన్లో కూడా బిఎమ్‌డబ్ల్యూ డ్రైవింగ్ అసిస్టెంట్ స్టాండర్డ్‌గా వస్తుంది. ఇది బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, రియర్ క్రాసింగ్ ట్రాఫిక్ వార్నింగ్ మరియు రియర్ కొలిజన్ నివారణతో లేన్ మార్పు వార్నింగ్ వంటి ఫీచర్స్ తో జత చేయబడింది.
బిఎమ్‌డబ్ల్యూ X3 ఎక్స్‌డ్రైవ్20d Mస్పోర్ట్ షాడో ఎడిషన్ లో పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
ముందుగా ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ గురించి చెప్పాలంటే , ఎస్‌యువి 188bhp మరియు 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ను పొందుతుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప