- ఆగస్టు 7వ తేదీన ఇండియాలో టాటా కర్వ్ లాంచ్
- కర్వ్ ఈవీతో పాటుగా లాంచ్ కాబోతున్న కర్వ్ ఐసీఈ వెర్షన్
ఆగస్టు 7వ తేదీన టాటా మోటార్స్ ఇండియాలో కర్వ్ రేంజ్ మోడల్స్ ని లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ధరల ప్రకటనకు ముందు, ఈ కూపే ఎస్‍యూవీకి సంబంధించి కొత్త వివరాలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఈ ఆర్టికల్ ద్వారా, మనం వచ్చే వారం లాంచ్ కాబోతున్న టాటా కర్వ్ మరియు మార్కెట్లో విక్రయించబడుతున్న హ్యుందాయ్ క్రెటా పోల్చి చూసి, ఏ కారు బెస్ట్ ఫీచర్లు కలిగి ఉందో తెలుసుకుందాం.
క్రెటాతో పోలిస్తే, టాటా కర్వ్ వివిధ కొత్త ఫీచర్లతో వస్తుంది. కొన్నింటిని చూస్తే, అందులో ఫాగ్ లైట్స్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, మరియు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్స్ తో వెల్ కం మరియు గుడ్ బై ఫంక్షన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా చూస్తే, క్రెటా కంటే ఎక్కువ అదనపు ఫీచర్లను కర్వ్ కారులో చూడబోతున్నాం, కర్వ్ కారు లోపల ఇల్యూమినేటెడ్ లోగోతో ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సబ్ వూఫర్ తో పాటుగా తొమ్మిది స్పీకర్ల మ్యూజిక్ సిస్టం, టచ్ బేస్డ్ ఎఫ్ఎటిసి కంట్రోల్స్, మరియు కారు ఫ్రంట్ మరియు రియర్ వరుస సీట్లలో 45Wయూఎస్‍బీ టైప్-సి ఛార్జర్ వంటి ఫీచర్లతో రానుంది.
అంతేకాకుండా, ఇది జెస్చర్ కంట్రోల్ తో పవర్డ్ టెయిల్ గేట్, ఎక్స్‌ప్రెస్ కూల్ ఫంక్షన్, కూలింగ్ మరియు ఇల్యూమినేషన్ ఫంక్షన్‌లతో గ్లోవ్‌బాక్స్, ఈఎస్‍పీ-బేస్డ్ డ్రైవర్ డోజ్-ఆఫ్ అలర్ట్ ( డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్ నిద్రపోకుండా అలర్ట్ చేసే ఫీచర్), హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు ఎడాస్-బేస్డ్ ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ (టిఎస్ఆర్) వంటి ఫీచర్లను కూడా అందుకుంటుంది. ముఖ్యంగా, లీకైన డాక్యుమెంట్ ఆధారంగా చూస్తే, కర్వ్ కారు 5-స్టార్ రేటింగ్ ని పొందినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్