ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్ బ్రాండ్స్ చాలా అభివృద్ధి చెందుతున్నాయి, సంప్రదాయమైన పెయింట్ స్కీమ్స్ తో పాటు అనేకమైన కలర్స్ ని అందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉంది. ఓఈఎం మ్యాట్ ఫినిష్ ని కియా ఇండియాలో తన మొదటగా ప్రారంభించగా, ఇది ప్రీ-ఫేస్‍లిఫ్ట్ సెల్టోస్ తో ప్రారంభమైంది. నేడు, చాలా కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఆ మోడల్స్ ఏంటో వాటిని మనం ఒకసారి పరిశీలిద్దాం.
స్కోడా స్లావియా
స్కోడా స్లావియా ఇండియాలో తన తాజా అప్ డేట్స్ లో మ్యాట్ బ్రిగేడ్ ని తీసుకువచ్చింది. రెగ్యులర్ స్టైల్ తో పోలిస్తే, అదనంగా కేవలం రూ. 40,000 ప్రీమియంతో రూ. 15.52 లక్షలు (ఎక్స్-షోరూం)తో స్లావియా మ్యాట్ ఎడిషన్ లాంచ్ అయింది.
మ్యాట్ ఫినిష్ లో కార్బన్ స్టీల్ పెయింట్ తో మాత్రమే కాకుండా, అంతటా గ్లోసీ బ్లాక్ హైలైట్ గా ఉంది. ఇంకా హైలైట్ ఫీచర్స్ లో పవర్డ్ ఫ్రంట్ సీట్స్, మరియు 10-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్ లెస్ మొబైల్ కనెక్టివిటీ, మరియు ఫుట్ వెల్ ఇల్యుమినేషన్ ఉన్నాయి.
కియా సెల్టోస్
ఫస్ట్ జనరేషన్ నుండే అందుబాటులో ఉన్నా, కియా సెల్టోస్ మ్యాట్ ఫినిష్ ని గ్రాఫైట్ మ్యాట్ ఫినిష్ గా పేర్కొంది. ఇది కేవలం ఎక్స్-లైన్ వేరియంట్ లో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ డిసిటి మరియు 1.5-లీటర్ డీజిల్ ఎటి వెర్షన్స్ లోమాత్రమే అందుబాటులో ఉంది. సెల్టోస్ ఎక్స్-లైన్ వేరియంట్ ధర రూ.19.60 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభమవుతుంది.
ఇది సేజ్ గ్రీన్ ఇన్సర్ట్స్ తో ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, గ్లోసీ బ్లాక్ ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్, 8-ఇంచ్ హెచ్‍యుడి, 360-డిగ్రీ కెమెరా, 8-స్పీకర్ బోస్ మ్యూజిక్ సిస్టం, మరియు బయట వైపు ఇతర గ్లోసి బ్లాక్ ఎలిమెంట్స్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
ఈ జర్మన్ బ్రాండ్ నుండి టైగున్ తర్వాత మ్యాట్ ట్రీట్ మెంట్ తో వచ్చిన సెకండ్ మోడల్ గా ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ నిలిచింది. ఎక్స్‌క్లూజివ్ గా ఇది జిటి ప్లస్ వేరియంట్ లభిస్తుండగా, కార్బన్ స్టీల్ మ్యాట్ గ్రే కలర్ లోనే కాకుండా రెడ్ యాక్సెంట్స్ లో కూడా అందుబాటులో ఉంది.
వర్టూస్ జిటి ప్లస్ కార్బన్ స్టీల్ మ్యాట్ గ్రే వేరియంట్ ధర రూ.16.90 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభమవుతుంది. దీని పవర్డ్ 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు 7-స్పీడ్ డిఎస్‍జి యూనిట్ తో జత చేయబడి ఉంది.
కియా సోనెట్
కియా గత సంవత్సరం ఎక్స్-లైన్ వెర్షన్ ని సోనెట్ రేంజ్ లో ప్రారంభించగా, దీని ధరలు రూ. 13.39 లక్షలు (ఎక్స్-షోరూం) తో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఎంట్రీ-లెవెల్ లో రూ.13.89 లక్షలు(ఎక్స్-షోరూం)ధరతో, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ డిసిటి మరియు 1.5-లీటర్ డీజిల్ ఎటిలలో అందుబాటులో ఉంది.
మొత్తానికి మ్యాట్ గ్రాఫైట్ తో ఉన్నా, సోనెట్ ఎక్స్-లైన్ బయటవైపు గ్లోసీ బ్లాక్ ఎలిమెంట్స్, కాంట్రాస్ట్ ఆరెంజ్ స్టిచింగ్, సోనెట్ లోగోతో లెదర్ స్టీరింగ్ వీల్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
స్కోడా కుషాక్
స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్ ను ఒక లిమిటెడ్ ఎడిషన్ గా, కేవలం 500 యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇది స్టైల్ మరియు మాంటే కార్లో వేరియంట్స్ లో మధ్య కరెక్టుగా సరిపోయింది. ఇది క్రోమ్ మరియు గ్లోసీ బ్లాక్ ఇన్సర్ట్స్ తోనే కాకుండా కార్బన్ స్టీల్ మ్యాట్ పెయింట్ ఫినిష్ తో కూడా అందించబడుతుంది.
కస్టమర్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ లో దీన్ని ఎంచుకోవచ్చు. అవి ఏవి అంటే – 1.0-లీటర్ 3-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్, 4-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్. అదే విధంగా, 6- స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ లతో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.
కియా కారెన్స్
కియాలో ఉన్న మ్యాట్ పెయింట్ బ్యాండ్‌వాగన్‌లోకి ఈ బ్రాండ్ ఎంపివి తాజా మోడల్, కారెన్స్ చేరింది. ఇది ఎక్స్-లైన్ వేరియంట్ లో అందుబాటులో ఉంది. ఇది 6-సీట్స్ లేఅవుట్‌తో మాత్రమే కాన్ఫిగర్ చేయబడింది. కస్టమర్స్ ఇందులో 7-స్పీడ్ డిసిటిమరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్స్ తో జతచేయబడిన 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ ను ఎంచుకోవచ్చు.
రెండు కొత్త థీమ్స్ తో ఇంటీరియర్ లో మార్పులు చేసింది. అవి ఏంటి అంటే – స్ప్లెండిడ్ సేజ్ గ్రీన్ మరియు టూ-టోన్ బ్లాక్. ఇంకా చెప్పాలంటే, ఇది ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వెనుక రియర్ సీట్ ఎంటర్ టైన్మెంట్(ఆర్ఎస్ఈ)ను కలిగి ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ టైగున్
ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్స్ రేంజ్ లో టైగున్ మరియు వర్టూస్ లను తీసుకువచ్చింది, దాదాపుగా మార్కెట్లో ఇవి ప్రవేశించాయి కూడా. అందులో ఒకటి టైగున్ కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ ఎడిషన్ కాగా, ఇది 4 వేరియంట్స్ లో రూ. 18.20 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
కస్టమర్స్ మ్యాట్ ఎడిషన్ వెర్షన్స్ ను ఈ 4 వేరియంట్స్ నుండి ఎంచుకోవచ్చు. అవి – జిటి ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ ఎంటి, జిటి ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ డిఎస్‍జి, జిటి ప్లస్ ఎడ్జ్ కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ ఎంటి (ఎలక్ట్రిక్ సీట్స్), మరియు జిటి ప్లస్ ఎడ్జ్ కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ (ఎలక్ట్రిక్ సీట్స్) డిఎస్‍జి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్