ఈ రోజుల్లో పెరుగుతున్న ధరలను బట్టి మనకు తగినంత బడ్జెట్లో కార్ లభిస్తుందా లేదా అని ఆలోచించే కస్టమర్ల కోసం ఒక గుడ్ న్యూస్ ని తీసుకువచ్చాము. సాధారణంగా రూ.10 లక్షల బడ్జెట్ లోపు బెస్ట్ కారును కనుగొనడం అంటే చాలాకష్టమైన పని, అలాంటిది మేము మీకోసం కొన్ని టాప్ కార్ల లిస్టును సిద్ధం చేశాము. అయితే, ఈ 2024 సంవత్సరం వివిధ ఆటోమేకర్ల నుంచి రూ.10 లక్షలలోపు లాంచ్ అయ్యే టాప్- 5 కార్ల లిస్టును ఎక్స్‌క్లూజివ్ గా మీకు అందిస్తున్నాం. ఈ టాప్- 5 కార్ల ప్రారంభ ధరలు, మోడల్ వివరాలు, వేరియంట్స్, ఫ్యూయల్ టైప్ వంటి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా మనం పరిశీలిద్దాం.
మారుతి న్యూ డిజైర్
మారుతి సుజుకి న్యూ డిజైర్, 2024 జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సబ్-4- మీటర్ సెడాన్ LXi, VXi, ZXi మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీని ధరలు రూ. 7.00 లక్షల నుంచి రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు అని అంచనా. అలాగే, న్యూ డిజైర్ లో 89bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి అవుట్‌గోయింగ్ వెర్షన్ నుండి 1.2-లీటర్, నాలుగు-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జత చేయబడి వచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ స్టార్గాజర్
హ్యుందాయ్ స్టార్గాజర్ ఆర్థిక సంవత్సరం-2024లోని ద్వితీయార్థంలో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఎంయువి 6 మరియు 7 సీట్స్ కాన్ఫిగరేషన్‌లతో వివిధ వేరియంట్‌లలో అందించబడుతుందని అంచనా. హ్యుందాయ్ స్టార్గాజర్ ధరలు రూ. 9.60 లక్షల నుండి రూ. 17.00 లక్షలు (ఎక్స్-షోరూమ్)మధ్య ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉండవచ్చని అంచనా. మెకానికల్‍గా, ఇందులో 113bhp/144Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటితో కూడా జతచేయబడి వచ్చే అవకాశం ఉంది.
టాటా ఆల్ట్రోజ్ రేసర్
కార్‌మేకర్ టాటా ఆల్ట్రోజ్ రేసర్ ను సెప్టెంబర్ 2024లో XE, XE+, XM+, XM+(S), XT, XZ, XZ+(S), మరియు XZ+O(S) అనే 8 వేరియంట్స్ లో లాంచ్ చేయనుందని అంచనా. దీని ధరలు రూ. 8.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జత చేయబడి, కొన్ని వేరియంట్‌లలో డీసీఏ ట్రాన్స్‌మిషన్ సిఎన్‍జి వెర్షన్ లో కూడా అందించబడే అవకాశం ఉందని భావిస్తున్నాం
టాటా పంచ్ ఫేస్లిఫ్ట్
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2024 చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నాం. ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.6.00 లక్షల నుండి రూ.11.00 లక్షలు (ఎక్స్-షోరూమ్)మధ్య ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉండవచ్చని అంచనా. కాంపాక్ట్ ఎస్‍యూవీ వివిధ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మెకానికల్‍గా, పంచ్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 85bhp మరియు 113Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడి ఉంటుందని భావిస్తున్నాం. అలాగే, ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ట్విన్-సిలిండర్ సిఎన్‍జి కిట్ తో అందించవచ్చని భావిస్తున్నాం.
కియా క్లావిస్
కియా క్లావిస్ కాంపాక్ట్ ఎస్‍యూవీ డిసెంబర్ 2024 నాటికి ఇండియాలో లాంచ్ కావచ్చు. కస్టమర్లు ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి కియా క్లావిస్ ధరలు రూ. 6.00 లక్షల నుండి రూ.10.00 లక్షల (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు) మధ్య ఉండవచ్చని అంచనా. దీనిని HTE, HTK, HTK+, HTX, HTX+ మరియు GTX+ అనే 6 వేరియంట్‌లలోపొందవచ్చు. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడే అవకాశం ఉంది.