ప్రస్తుత కాలంలో, ఎక్కువ మంది ప్రజలు ఇతర రవాణా మార్గాల కంటే కారులో ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతారు, ఎందుకంటేవారు కంఫర్ట్, రోబస్ట్ పెర్ఫార్మెన్స్, స్పేషియస్ ఇంటీరియర్స్ మరియు పెద్ద బూట్ స్పేస్‌ను కోరుకుంటారు. ఇప్పుడు వారికి ఇవి అన్నీ లభించే ఎస్‍యువిల అవసరం ఏర్పడింది. కాబట్టి మీరు కూడా వాటిలో ఒకదాన్ని కొనాలని ప్లాన్ చేస్తుంటే, అలాగే మీ బడ్జెట్ 10 లక్షల లోపు ఉంటే (ఎక్స్-షోరూమ్) ఈ ఆర్టికల్ ను తప్పకుండా చివరి వరకు పూర్తిగా చదవండి.
మారుతి సుజుకి బ్రెజా
ఈ లిస్టును ఒకసారి పరిశీలిస్తే మొట్టమొదటి స్థానంలో మారుతి సుజుకి బ్రెజా ఉంది. జూన్ 2022లో లాంచ్ చేసిన 5-సీట్స్ ఎస్‍యువిని LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు వేరియంట్స్ లో మీరు పొందవచ్చు. LXi, LXi CNG మరియు VXi వేరియంట్స్ ను రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) లోపు కొనుగోలు చేయవచ్చు. హుడ్ కింద, బ్రెజా 103bhp మరియు 138Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక ఆటోమేటిక్ యూనిట్ ద్వారా ట్రాన్స్మిషన్ విధులు కొనసాగుతాయి.
టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్
రెండవది, కొత్తగా లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్. ఎస్‍యువి తాజా ఇటరేషన్ నాలుగు వేరియంట్స్ రెండు పవర్‌ట్రెయిన్‌లలో అందించబడుతుంది. ఇందులో స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్‌లెస్ అనే వేరియంట్స్ ఉన్నాయి, ఆప్షన్ ప్యాక్‌లో చూస్తే 'ప్లస్(+)' సఫిక్స్ మరియు 'S' సఫిక్స్ సన్‌రూఫ్ వేరియంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ప్యూర్, స్మార్ట్, స్మార్ట్ ప్లస్, సన్‌రూఫ్‌తో కూడిన స్మార్ట్ ప్లస్ వేరియంట్స్ ను ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్)లోపు మీరు పొందవచ్చు.
కియా సోనెట్
సౌత్ కొరియా ఆటోమేకర్కియా, దాని ఎంట్రీ-లెవెల్ ఎస్‍యువి సోనెట్‌ను రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) బడ్జెట్‌లో అందిస్తోంది. ఇందులో గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే, ఆసక్తి కలిగిన కస్టమర్స్ ఐఎంటి గేర్‌బాక్స్ ఆప్షన్ తో ఎంట్రీ-లెవల్ డీజిల్ వేరియంట్ HTEని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా, పైన పేర్కొన్న బడ్జెట్‌లో పెట్రోల్ సంబంధించి HTE, HTK మరియు HTK ప్లస్ వేరియంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
హ్యుందాయ్ వెన్యూ
లిస్టులో చివరిది హ్యుందాయ్ వెన్యూ. ఇది E, S, S(O), S Plus, SX, మరియు SX(O) వేరియంట్స్ లో లభిస్తుంది, అదే విధంగా ఈ5-సీట్ ఎస్‍యువి పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో లభిస్తుంది. బ్యాడ్ లక్ ఏంటి అంటే, 1.2-లీటర్ నేచురల్ అస్పిరేటెడ్పెట్రోల్ ఇంజన్‌ను E, S, S(O), మరియు S(O) నైట్ ఎడిషన్‌లను మాత్రమే రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) లోపు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్