ఇండియాలో ఎస్‍యూవీసెగ్మెంట్ దాని పాపులారిటీని కొనసాగిస్తుంది. మే-2024లో వివిధ బ్రాండ్లకు చెందిన ఎస్‍యూవీలు బెస్ట్ సేల్స్ రిజిస్టర్ చేశాయి. కస్టమర్ల నుంచి ఎస్‍యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని ఈ నెల సేల్స్ రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా, మే నెలలో అత్యధిక యూనిట్లను విక్రయించిన టాప్-5 ఎస్‍యూవీల గురించి తెలుసుకుందాం.
టాటా పంచ్
టాటా పంచ్ మే నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీగా నిలిచింది. టాటా కంపెనీ 18,949 యూనిట్ల పంచ్ కార్లను విక్రయించింది. గత సంవత్సరం మే-2023తో పోలిస్తే ఈ సంవత్సరం 11,124 యూనిట్లు ఎక్కువ విక్రయించి భారీగా 70% వృద్ధిని సాధించింది. ఇండియాలో టాటా పంచ్ కి పాపులారిటీ చాలా వేగంగా పెరుగుతూ ఇది కస్టమర్ల మొదటి ఛాయిస్ గా మారుతోంది.
హ్యుందాయ్ క్రెటా
ఈ సంవత్సరం మే నెలలో హ్యుందాయ్ క్రెటా 14,662 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఇది గత ఏడాది మే 2023లో 14,449 యూనిట్లతో పోలిస్తే 1% ద్వారాస్వల్ప వృద్ధిని రిజిస్టర్ చేసింది. దీనికి డిమాండ్ స్థిరంగా కొనసాగడం ద్వారా టాప్-5లో నిలిచింది. హ్యుందాయ్ క్రెటా ఆకర్షణీయమైన డిజైన్ మరియు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ దానిని మార్కెట్లో పాపులర్ కారుగా మార్చింది.
మారుతి సుజుకి విటారా బ్రెజా
ఈ సంవత్సరం మే నెలలో మారుతి సుజుకి విటారా బ్రెజా 14,186 యూనిట్లను విక్రయించి మూడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం అనగా మే-2023లో, మారుతి 13,398 యూనిట్ల విటారా బ్రెజా కార్లను విక్రయించింది.ఇది ఈ సంవత్సరం విక్రయించిన వాటితో పోలిస్తే 6% ఎక్కువ. విటారా బ్రెజా అమ్మకాలను బట్టి చూస్తే. మారుతి నుండి వచ్చిన ఈ ఎస్‍యూవీనిలకడగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందిస్తుందని చెప్పవచ్చు.
మహీంద్రా స్కార్పియో
మే-2024లో మహీంద్రా స్కార్పియో 13,717 యూనిట్లను విక్రయించి, 47% ద్వారా గణనీయమైన వృద్ధిని రిజిస్టర్ చేసింది. సేల్స్ ని పోల్చి చూస్తే, గత ఏడాది మే-2023లో 9,318 యూనిట్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా స్కార్పియో దృఢత్వం మరియు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ద్వారా వినియోగదారులలో విపరీతమైన డిమాండ్ ద్వారా పాపులారిటీని పొందింది. దీని ద్వారా సేల్స్ రిపోర్టులో ఈ ఎస్‍యూవీనాలుగవ స్థానంలో నిలిచింది.
టాటా నెక్సాన్
మే-2024లో టాటా 11,457 యూనిట్ల నెక్సాన్ కార్లను విక్రయించింది, అయితే గత ఏడాది మే-2023లో 14,423 యూనిట్లను విక్రయించింది, దీని వల్ల 21%సేల్స్ పడిపోయాయి. అయినప్పటికీ, ఇది టాప్-5లో దాని స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. నెక్సాన్ దాని సేఫ్టీ మరియు ఫీచర్ల కారణంగా డిమాండ్‌లో ఉంది.అయితే కొంత వరకు సేల్స్ తగ్గినా, మార్కెట్ లో టాటా నెక్సాన్ బెస్ట్ ప్లేయర్ అని చెప్పవచ్చు.
అంతే కాకుండా, మహీంద్రా ఇటీవల రిలీజ్ చేసిన XUV 3XO, అదేనండీ XUV300 అప్‌గ్రేడ్ మోడల్ ద్వారా 10,000 యూనిట్లను విక్రయించి, 95% వృద్ధిని రిజిస్టర్ చేసింది. ఈ ఎస్‍యూవీకూడా బాగా పాపులర్ గా నిలిచి, ఆటో మొబైల్ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది.
ముగింపు
ఎస్‍యూవీసెగ్మెంట్ మే-2024లో మిశ్రమ ఫలితాలను అందించింది. కొన్ని మోడల్స్ గణనీయమైన వృద్ధిని సాధించినప్పటికీ, కొన్ని ఎస్‍యూవీల సేల్స్ పడిపోయాయి. అయితే మొత్తం మీద, ఎస్‍యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. దీన్ని బట్టి చెప్పవచ్చు వినియోగదారులు వీటిని ఎంత విశ్వసిస్తున్నారు అనేది. టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విటారా బ్రెజా, మహీంద్రా స్కార్పియో మరియు టాటా నెక్సాన్ ఈ నెల సేల్స్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందించాయి. మహీంద్రా XUV 3XO కూడా ఊహించిన దాని కంటే ఎక్కువగా వృద్ధిని సాధించింది. ఈ సేల్స్ ని బట్టి మార్కెట్‌లో ఎస్‌యూవీల జోరు ఎంతగా ఉందో చెప్పకనే చెప్పవచ్చు. కస్టమర్లలో వీటికి ఉన్న పాపులారిటీ ఇంకా చెక్కుచెదరకుండా అలానే ఉందని మనం భావించవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్