గత సంవత్సరం చివరి వరకు భారతదేశంలో సెడాన్‌లు క్రమక్రమంగా తగ్గుతున్న దశలో ఈ సంవత్సరం ఈ విభాగంలో అనేక లాంచ్‌లను మార్కెట్లోకి వచ్చాయి. కొత్తవి కాకపోయినప్పటికీ, వెర్నా, ఫిఫ్త్-జెన్ సిటీ వంటివి ఈ తరానికి సంబంధించిన మిడ్-లైఫ్ అప్ డేట్లతో మార్కెట్లోకి వచ్చాయి. ఈ కథనంలో మనం మరెన్నో చూడబోతున్నాం. ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలైన మరియు మార్కెట్ పై ప్రభావం చూపిన మొదటి ఐదు సెడాన్ల జాబితాను మీకోసం మేము సిద్ధం చేసాము.
అవేంటో ఇప్పుడు చూద్దాం..
హ్యుందాయ్ వెర్నా
మార్చిలో ప్రారంభించబడిన, హ్యుందాయ్ వెర్నా బ్రాండ్ కొత్త 'పారామెట్రిక్ డైనమిజం' డిజైన్ గుర్తింపుతో ఓల్డ్ జెన్‌ను భర్తీ చేసింది. న్యూ వెర్నా దాని మోడరన్ అండ్ షార్పర్ లుక్స్ మరియు దాని కంపెటీటార్స్ కంటే ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశించింది ధరల విషయానికొస్తే, మిడ్-సైజ్ సెడాన్ నాలుగు వేరియంట్‌లలో ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). యాంత్రికంగా, వెర్నాలో 1.5-లీటర్ పెట్రోల్ మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కూడిన టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఇది భారతదేశంలోని హోండా ఫిఫ్త్-జెన్ సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మరియు స్కోడా స్లావియాతో పోటీపడుతుంది.
హోండా ఫిఫ్త్-జెన్ సిటీ
హోండా మార్చిలో భారతదేశంలో తన ఫిఫ్త్-జెన్ సిటీ యొక్క మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. సెడాన్ దాని ట్వీక్స్ మరియు ఇంటీరియర్‌లో చిన్న చిన్న మార్పులను చేసింది. దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). న్యూ బేస్ వేరియంట్‌తో పాటు, సిటీ ఇప్పుడు దాని లైనప్‌లో SV, V, VX మరియు ZX అనే నాలుగు వేరియంట్‌లను కలిగి ఉంది. న్యూ సిటీ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో 1.5-లీటర్ ఇంజిన్ రెండు రకాల ట్యూన్, పెట్రోల్ మరియు హైబ్రిడ్ సెటప్ ఉన్నాయి. ముఖ్యంగా, హైబ్రిడ్ వెర్షన్ల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్) రూ. 18.89 లక్షలు.
హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది జనవరిలో న్యూ గ్రాండ్ ఐ10 నియోస్‌తో పాటు కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టింది. అప్డేటెడ్ మోడల్ నాలుగు వేరియంట్లలో, ఏకైక కేవలం పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో ఆరు కలర్ ఆప్షన్లతో అందించబడుతుంది. దీని ప్రారంభ ధర రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు న్యూ ఫ్రంట్ ఫాసియా, రివైజ్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో సహా కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఫీచర్ల విషయానికొస్తే, కాంపాక్ట్ సెడాన్‌లో స్టాండర్డుగా నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, టిపిఎంఎస్, వైర్‌లెస్ ఛార్జర్, ఫుట్‌వెల్ లైటింగ్, ఎనిమిది ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‍తో పాటు మరిన్ని ఉన్నాయి.
మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్
మెర్సిడెస్-బెంజ్, లగ్జరీ ఆటోమేకర్, మే 2023లో సెడాన్ అప్డేటెడ్ ఎంట్రీ-లెవల్, ఎ-క్లాస్‌ను అప్‌డేట్ చేసింది. ఈ సెడాన్ పెట్రోల్-మాత్రమే అవతార్‌లో రూ. 45.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). అంతేకాకుండా, బ్రాండ్ ఎ-క్లాస్ డీజిల్ వెర్షన్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనుంది. మార్పుల పరంగా, న్యూ ఎ-క్లాస్ న్యూ గ్రిల్, స్లీకేర్ హెడ్‌ల్యాంప్‌లు, ట్వీక్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్లు మరియు రీవాంప్డ్ క్యాబిన్‌తో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ ఫేస్‌ను కలిగి ఉంది. కారుకు పవరింగ్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఏడు-స్పీడ్ DCT యూనిట్ జత చేయబడింది, ఇది 161bhp మరియు 250Nm టార్క్‌ను అందిస్తుంది.
బిఎండబ్ల్యూ 7 సిరీస్
సెవెంత్-జెన్ బిఎండబ్ల్యూ 7 సిరీస్ దాని ఎలక్ట్రిక్ ట్విన్, i7తో పాటు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద కిడ్నీ ఆకారంలో గ్రిల్, ఆంగులర్ కట్‌లు మరియు క్రీజ్‌లు, గుండ్రని ఎల్ఈడి టైల్‌లైట్లు మరియు ముందు మరియు వెనుక ట్వీక్ చేయబడిన బంపర్ లగ్జరీ సెడాన్ బ్రాండ్ ఇటీవలి డిజైన్ ట్రెండ్‌ను అనుసరిస్తూ సింగల్ టాప్-స్పెక్ వెర్షన్‌లో అందించబడింది. i7 ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం స్కై రూఫ్‌పై మౌంట్ చేయబడిన 31-ఇంచ్ 8k థియేటర్ డిస్‌ప్లే మరియు ఇతర హైటెక్ ఫీచర్‌లతో వస్తుంది. మార్కెట్లో 7 సిరీస్ ప్రస్తుత రిటైల్ ధర రూ. 1.70 కోట్లు. ఇది 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 376bhp మరియు 520Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప