హెడ్‌లైన్లోనే చాలా క్లుప్తంగా ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ఈ కథనంలో ఫ్యాన్‌ఫేర్ చేసి ముందుకు కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే పూర్తి అప్‌డేట్స్ తో లోడ్ చేసిన మోడల్ ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం. సేఫ్టీ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మేము ఏవి ఎంపిక చేశామో తెలుసుకోవచ్చు. మీరు కొనాలనుకునే కారును వెబ్‌సైట్‌లో ఉన్న కార్లతో పోల్చి చూసేందుకు టూల్ ని కూడా ఇక్కడ లిస్ట్ చేసాము.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పూర్తిగా లోడ్ చేసిన ఏటీ మరియు ఎంటి వేరియంట్‌లలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఒక రేంజ్ లో స్టాండర్డ్ గా పొందింది. దీని రెండవ వరుస సీట్స్ మధ్యలో కూర్చున్న ప్రయాణీకులకు సేఫ్టీ త్రీ -పాయింట్ సీట్ బెల్ట్, టిపిఎంఎస్ మరియు సీట్‌బెల్ట్ వార్నింగ్ తో పాటు ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంటు పాయింట్‌ను కూడా కలిగి ఉంది. చివరి టెస్ట్‌లో, జిఎన్ క్యాప్ లో గ్రాండ్ i10 నియోస్ 2 స్టార్స్ స్కోర్ చేసింది , అయితే, ఈ కారులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చడంతో దీనిలో అనుభూతి కొత్తగా ఉంటుందని మేము భావిస్తున్నాము.
రెనాల్ట్ ట్రైబర్
ఫ్రెంచ్ ఆటోమేకర్ యొక్క సబ్-4 ఎంపివిని దాని టాప్-స్పెక్ ఆర్‍ఎక్స్‌జెడ్ ఎఎంటిలో మంచి కిట్‌ను కలిగి ఉంది. టాప్ వెర్షన్ నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి మరియు మరియు జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. అలాగే, ఇది టిపిఎంఎస్ ని కూడా కలిగి ఉంది కానీ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లను మరియు రెండవ వరుసలో ఉన్నవారికి, మూడవ వరుసలో ఉన్నవారికి త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్స్ లేవు.
సిట్రోన్ C3
ఈ లిస్టులో జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేని కొన్ని కార్లలో సిట్రోన్ C3 ఒకటి. సేఫ్టీ సూట్‌లో భాగంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, టిపిఎంఎస్, చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు మరియు సీట్ బెల్ట్ వార్నింగ్‌లను కలిగి ఉంది. అయితే రెండవ వరుసలో ఉన్నవారికి త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ ను ఈ కారు కూడా పొందలేదు.
టాటా టియాగో మరియు టిగోర్
టాటా టియాగో మరియు టిగోర్ రెండూ జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఈ రెండు కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, టిపిఎంఎస్ మరియు సీట్ బెల్ట్ వార్నింగ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు కార్లలో, మిడిల్-రియర్ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లు లేదా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు లేవు.
మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతిలో మోస్ట్ పాపులర్ బ్యాడ్జ్ ను పొందిన న్యూ-జనరేషన్ మోడల్ ని వచ్చే ఏడాది పొందుతుంది, అయితే ప్రస్తుతానికి 2018 మోడల్ కారు మాత్రమే విక్రయించబడుతోంది. ఇది చివరి రౌండ్ జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను స్కోర్ చేసి సెగ్మెంట్‌లో బెస్ట్ సేఫ్టీ సూట్‌ను కలిగి ఉంది. ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు సీట్ బెల్ట్ వార్నింగ్ అలర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో నిరాశపరిచే అంశం ఏంటి అంటే మిడిల్-రియర్ సీట్ బెల్ట్ లేదా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) ఇందులో లేదు.
అనువాదించిన వారు: రాజపుష్ప