- సిట్రోన్ C3పై అత్యధిక డిస్కౌంట్స్
- ఇగ్నిస్ పై కూడా కొనసాగుతున్న భారీ డిస్కౌంట్
హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ ఎప్పుడూ ఇండియన్ కస్టమర్స్ కు బడ్జెట్ పరంగా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ, మారుతి సుజుకి మాత్రం వరుసగా ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్ మరియు ఆల్టో కె10 వంటి ప్రొడక్ట్స్ తో ముందుకు దూసుకెళుతుంది. ఎలాగైతే ఏంటి, ప్రస్తుత కాలంలో కస్టమర్స్ తమ పంథాను మార్చి ఎస్‍యువి వైపుగా మొగ్గు చూపుతున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి, చాలా కంపెనీలు ఎంట్రీ-లెవెల్ హ్యచ్ బ్యాక్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.
సిట్రోన్ C3
ఇండియాలో సిట్రోన్ C3రూ. 5.71లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో చివరి సంవత్సరం లాంచ్ అయింది. ప్రస్తుతం, ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ ఎంట్రీ ఎంట్రీ-లెవెల్ హ్యచ్ బ్యాక్ పై రూ.99,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. అంతే కాకుండా, ఈ ఆటోమేకర్ కొన్ని సెలెక్టెడ్ వేరియంట్స్ పై “బై నౌ & పే లేటర్” అనే ఆప్షన్ ని కూడా కస్టమర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది.
మారుతి సుజుకి ఇగ్నిస్
ఇండియన్ ఆటోమేకర్ నుంచి అతి తక్కువగా అమ్ముడుపోయిన మోడల్స్ లో ఒకటిగా మారుతి సుజుకి ఇగ్నిస్ నిలిచింది. క్విర్కి- లుకింగ్ హ్యచ్ బ్యాక్ పై రూ.70,000 వరకు భారీగా డిస్కౌంట్స్ అందించనుంది. ఈ ఆఫర్స్ రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.10,000 కార్పోరేట్ డిస్కౌంట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.
మారుతి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియోను ప్రస్తుతం రూ.5.36 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యచ్ బ్యాక్ రూ.59,000 డిస్కౌంట్ తో పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ హ్యచ్ బ్యాక్ ను కస్టమర్స్ అక్టోబర్ 2023లో బుక్ చేసుకొని ఉంటే వారు రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.4,000 కార్పోరేట్ డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందుతారు.
రెనాల్ట్ క్విడ్
హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ లో రెనాల్ట్ క్విడ్ అన్నింటికంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉన్న హ్యచ్ బ్యాక్ గా నిలిచింది. మార్కెట్లో రూ.4.69 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో రెనాల్ట్ క్విడ్ మారుతి సుజుకి K10 మరియు మారుతి ఎస్-ప్రెస్సో పోటీ పడుతుంది. అక్టోబరులో ఈ హ్యచ్ బ్యాక్ పై రూ.50,000 వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
ఇండియన్ మార్కెట్లో కొరియన్ ఆటోమేకర్ నుంచి సాంత్రో అమ్మకాలు నిలిచిపోయిన తర్వాత, ఎంట్రీ లెవెల్ లో దాని తర్వాత వస్తున్న మోడల్ గా హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ నిలిచింది. ఈ సంవత్సరం హ్యచ్ బ్యాక్ ఫేస్ లిఫ్ట్ లో వచ్చిన తర్వాత ప్రస్తుతం దీని ధరలు రూ.5.84 లక్షలు నుంచి రూ.8.51 లక్షలు(ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. అదే విధంగా, ప్రస్తుతం ఈ మోడల్ పై రూ.50,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.10,000 కార్పోరేట్ డిస్కౌంట్ రూపంలో కస్టమర్స్ పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్