ఇటీవల సిఎన్‌జి వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇక సిఎన్‌జి వాహనాలను వాడటం వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా అదుపు చేయవచ్చు. ఈ కథనంలో, టాప్-5 పాపులర్ సిఎన్‌జి కార్లను కార్‌వాలే మీ దృష్టికి తెచ్చింది. అలాగే మీ బడ్జెట్ 10 లక్షల లోపు ఉంటే, సిఎన్‌జి కార్ల (ఎక్స్-షోరూమ్) ధరలను ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
మారుతి సుజుకి స్విఫ్ట్
పాపులర్ సిఎన్‌జి కార్లలో సుజుకి స్విఫ్ట్ ఒకటి, ఇండియాలో 1 ఏప్రిల్, 2023లో లాంచ్ తర్వాత ఇండియన్ మార్కెట్‌లో ప్రత్యేక స్థాయిని పొందింది, ఈ స్విఫ్ట్ vxi, zxi అనే 2 సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధరల విషయానికి వస్తే, స్విఫ్ట్ vxi ధర రూ.7.85 లక్షలు ఉండగా, స్విఫ్ట్ zxi రూ .8.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇంకా, ఇందులో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది.
మారుతి సుజుకి బ్రెజా
మారుతి బ్రెజాజూన్ 30న 2023లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. బ్రెజా LXi S- సిఎన్‌జి అనేది మారుతి బ్రెజా లైనప్‌లోని సిఎన్‌జి వేరియంట్ మరియు దీనిని రూ. 9.24 లక్షల ధర (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే, బ్రెజా ఇంటీరియర్ భాగంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, హెడ్-అప్ డిస్ప్లే (హెచ్‌యూడి), సుజు ఫీచర్ టెలిమాటిక్స్, న్యూ 9-ఇంచ్ వంటి ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యూ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మరియు ఈఎస్‍పి వంటి ఫీచర్స్ ఉన్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్
ఇండియాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‍యువిని 2023లో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ చేసింది.ఈ ఫ్రాంక్స్ ని సిగ్మా, డెల్టా అనే 2 సిఎన్‌జి వేరియంట్‌లలో పొందవచ్చు. సిగ్మా ధర రూ.8.41 లక్షలు ఉండగా, డెల్టా ధర రూ. 9.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)ఉంది. ఎక్స్‌టీరియర్ ఎల్ పరంగా చూస్తే, ఫ్రాంక్స్‌లో ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 16-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్ట్ కలర్డ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ మరియు సిల్వర్ రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇందులో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 పోటీలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కాంపాక్ట్ S, మరియు SX అనే 2 సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధర విషయానికొస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ S వెర్షన్ ధర రూ. 8.43 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉండగా, ఎక్స్‌టర్ SX వెర్షన్ ధర రూ. 9.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)ఉంది. ఇంకా, ఇది 6 కలర్స్‌లో అందుబాటులో ఉంది.
టాటా పంచ్
టాటా పంచ్ మొత్తం ప్యూర్, అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డాజిల్ సన్‌రూఫ్ అనే 5 సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో బిఎస్6 ఫేజ్ 2- కంప్లైంట్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఒక ఏఎంటి యూనిట్ తో జతచేయబడి ముందు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
టాటా పంచ్ సిఎన్‌జి వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
సిఎన్జి వేరియంట్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
ప్యూర్ | రూ. 7.09 లక్షలు |
అడ్వెంచర్ | రూ. 7.85 లక్షలు |
అడ్వెంచర్ రిథమ్ | రూ. 8.20 లక్షలు |
అకాంప్లిష్డ్ | రూ.8.85 లక్షలు |
అకాంప్లిష్డ్ డాజిల్ సన్‌రూఫ్ | రూ. 9.68 లక్షలు |