ప్రస్తుత కాలంలో, బడ్జెట్ కార్లు ఫ్యాన్సీ ఫీచర్స్ తో అందుబాటులోకి తీసుకురాగా, అందులో ఒక ఫీచర్ మాత్రం స్టాండర్డ్ అందించబడుతుంది. అది ఏది అంటే డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్. దీనికి సంబంధించి, రూ.12 లక్షలులోపు డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లేతో లభించే టాప్-5 కార్ల లిస్టును మేము మీకోసం సిద్ధం చేసాము.
హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ.7.90 లక్షలు (అన్నీ వేరియంట్స్ లో లభ్యం)
బేస్ వేరియంట్ నుండి ఫుల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో అమర్చబడగా మరియు అంతే కాకుండా వెన్యూ 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటర్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది.
ఇంజిన్స్ గురించి చెప్పాలంటే, వెన్యూ పవర్డ్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ వచ్చింది. హ్యుందాయ్ వెన్యూ టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, నిస్సాన్ మాగ్నైట్ మరియు కియా సోనెట్ వంటి వాటికి పోటీగా ఉంది.
టాటా నెక్సాన్ – రూ.8.10 లక్షల నుండి ప్రారంభం (ఫియర్ లెస్ వేరియంట్ నుండి)
కొత్త 2023 నెక్సాన్ ఫుల్లీ డిజిటల్ 10.2-ఇంచ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. ఇది 3 డయల్ మోడ్స్ ని పొందడమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్ మరియు ఇతర వాహన సర్వీసులను కూడా కలిగి ఉంది. అయితే,డిజిటల్ స్క్రీన్ ఫియర్‌లెస్ మరియు ఫియర్‌లెస్ వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ఫీచర్ తో పాటుగా నెక్సాన్ 10.2-ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మరియు కొత్త ఎయిర్ కాన్ ప్యానెల్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది.
రెనాల్ట్ కైగర్ - రూ.6.5 లక్షల నుండి ప్రారంభం (RXZ వేరియంట్ నుండి)
రెనాల్ట్ కైగర్ క్యాబిన్ 7-ఇంచ్ కలర్డ్ టి ఎఫ్ టి స్క్రీన్ తో వచ్చింది. ఇది RXZ వేరియంట్స్ లో అందుబాటులోకి రాగా, ఇందులో ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, యాంబియంట్ లైట్స్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలను వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పేర్కొన్న అదే సైజులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ దాని డిఎన్ఎ సిబ్లింగ్ అయిన నిస్సాన్ మాగ్నైట్‌లో కూడా అందించబడుతుంది.
సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ - రూ.9.99 లక్షల నుండి ప్రారంభం ( అన్ని వేరియంట్స్ )
సిట్రోన్ ఈ మధ్యే లాంచ్ అయిన ఎస్‍యూవీ అని చెప్పవచ్చు, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ లోని అన్నీ వేరియంట్స్ లో 7-ఇంచ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవెల్ C3తో పోలిస్తే ఇది పెద్ద యూనిట్ మరియు కలర్డ్ డయల్స్ కలిగి ఉంది. సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ ను పవర్డ్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే 3 వేరియంట్స్ లో పొందవచ్చు. దీని ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడగా మరియు ఇది 109bhp మరియు190Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ - రూ.6 లక్షల నుండి ప్రారంభం (అన్ని వేరియంట్స్)
ఎక్స్‌టర్ మరియు వెన్యూ ఒకే రకమైన డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉన్నాయి. వెన్యూ ప్రారంభ ధర దాదాపుగా 8 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, ఎక్స్‌టర్ ప్రారంభ ధర దాని కంటే తక్కువగా 6 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభమవుతుంది. అలాగే ఇందులో 8-ఇంచ్ యూనిట్ తో మరియు ఈకో, నార్మల్, మరియు స్పోర్ట్ అనే 3 డ్రైవ్ మోడ్స్ ఫీచర్స్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్