- ఎంజి పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని మోడల్స్ లో అందుబాటులోకి వచ్చిన స్పెషల్ ఎడిషన్
- వందేళ్ల ఎక్స్ క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్
ఎంజి దాని స్పెషల్ ఎడిషన్ లోని టాప్-3 హైలైట్ లను వెల్లడించింది. ఎంజి హెక్టర్, ఆస్టర్, ZS EV మరియు కామెట్ EV లలో లిమిటెడ్ ఎడిషన్లను లాంచ్ చేసిన తర్వాత దాని 100వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంలో స్పెషల్ ఎడిషన్ లోని టాప్-3 హైలైట్స్ ఈ ఆర్టికల్ లో ఉన్నాయి.
ఎవర్ గ్రీన్ ఎక్స్టీరియర్
ఎంజి 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్స్ డార్క్ బ్రిటిష్ గ్రీన్ షేడ్ మరియు స్టార్రి బ్లాక్ రూఫ్‌తో 'ఎవర్గ్రీన్' ఎక్స్టీరియర్ ను పొంది ఉన్నాయి. ఇతర అంశాలలో డార్క్ షేడ్‌లో పూర్తి చేయబడి మరియు కార్లు టెయిల్‌గేట్‌పై '100-ఇయర్ ఎడిషన్' బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి.
ఆల్ -బ్లాక్ ఇంటీరియర్
లిమిటెడ్ ఎడిషన్ మోడళ్ల లోపలి భాగంలో, ముందు హెడ్రెస్ట్లపై ఎంబ్రాయిడరీ చేసిన '100-ఇయర్ ఎడిషన్'తో ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంది.
ఎవర్ గ్రీన్ థీమ్
ఇంటీరియర్ పూర్తిగా బ్లాక్ థీమ్‌తో డార్క్ గాఉన్నప్పటికీ, కార్‌మేకర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ హెడ్ యూనిట్లో కూడా 'ఎవర్గ్రీన్' థీమ్‌ను కొనసాగించేలా డిజైన్ చేసింది.
ఎంజి 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్లలో పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
EVలలో ఇంజిన్ ఆప్షన్స్ లేదా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో కూడా ఎటువంటి మార్పులు లేవు. ప్రస్తుతం కస్టమర్లు అమ్మకానికి ఉన్నఈ కార్లతో పాటు ఆఫర్లో ఉన్న ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో నుండి దేనినైనా ఎంచుకోవచ్చు.
ఎంజి 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది ఇవ్వబడ్డాయి:
హెక్టర్ - రూ. 21.20 లక్షలు
ఆస్టర్ - రూ. 14.81 లక్షలు
ZS EV – రూ. 24.18లక్షలు
కామెట్ EV - రూ. 9.40 లక్షలు
అనువాదించిన వారు: రాజపుష్ప