- సెప్టెంబర్ 2023అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచిన మారుతి బాలెనో
- లిస్టులో 10వ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ వెన్యూ
సెప్టెంబర్ 2023లో ఆటోమొబైల్ సెక్టార్ సేల్స్ లో భాగంగా గణనీయమైన వృద్ధిని సాధించింది. పండుగ సీజన్‌కు ముందే సరికొత్త రికార్డును సృష్టించింది. మొత్తానికి 10 స్థానాల్లో 6 స్థానాలలో మారుతీ సుజుకీ నిలవగా, మిగిలిన నాలుగు స్థానాలలో టాటా మరియు హ్యుందాయ్ నిలిచాయి. ఈ ఆర్టికల్ లో, గత నెలలో భారతదేశంలో విక్రయించిన టాప్ 10 ప్యాసింజర్ కార్ల లిస్ట్ ను సిద్ధం చేశాము.
సెప్టెంబర్ 2023లో టాప్ 10 ప్యాసింజర్ కార్స్ అమ్మకాల్లో 18,417 యూనిట్స్ సేల్స్ తో మారుతి సుజుకి బాలెనో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా రెండవ, మూడవ మరియు నాల్గవ స్థానాలలో వ్యాగన్ ఆర్, నెక్సాన్ మరియు బ్రెజా నిలిచి 16,250 యూనిట్స్, 15,235 యూనిట్స్ మరియు 15,001 యూనిట్స్ రికార్డు సేల్స్ ను రిజిస్టర్ చేశాయి.
సెప్టెంబరు 2023లో 14,703 యూనిట్స్ సేల్స్ తో మారుతి స్విఫ్ట్ ఐదవ స్థానంలో నిలవగా, 13,880 యూనిట్స్ సేల్స్ తో లో దాని సెడాన్ సిబ్లింగ్ డిజైర్ దాని తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో కేవలం మారుతి సుజుకి ఎర్టిగా ఎంపివి మాత్రమే గత నెలలో 13,528 యూనిట్స్ రిటైల్ సేల్స్ తో ఏడవ స్థానంలో నిలిచింది.
ముఖ్యంగా చెప్పాలంటే, చివరి మూడు స్థానాల్లో ఎస్‌యూవీలు నిలిచాయి. టాటా పంచ్ 13,036 యూనిట్స్ తో ఎనిమిదో స్థానంలో, క్రెటా 12,717 యూనిట్స్ తో తొమ్మిదో స్థానంలో, వెన్యూ 12,204 యూనిట్స్ తో 10వ స్థానంలో నిలిచాయి.
సెప్టెంబర్ 2023లో విక్రయించిన టాప్ 10 కార్ల లిస్ట్ క్రింద ఇవ్వబడింది:
నెంబర్ | కార్ | విక్రయించిన యూనిట్స్ |
1 | మారుతి సుజుకి బాలెనో | 18,417 |
2 | మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ | 16,250 |
3 | టాటా నెక్సాన్ | 15,235 |
4 | మారుతి సుజుకిబ్రెజా | 15,001 |
5 | మారుతి సుజుకి స్విఫ్ట్ | 14,703 |
6 | మారుతి సుజుకి డిజైర్ | 13,880 |
7 | మారుతి సుజుకి ఎర్టిగా | 13,528 |
8 | టాటా పంచ్ | 13,036 |
9 | హ్యుందాయ్క్రెటా | 12,717 |
10 | హ్యుందాయ్వెన్యూ | 12,204 |
అనువాదించిన వారు:రాజపుష్ప