- ఇండియా అంతటా 5% మేర పెరిగిన టోల్ ఫీజు
- నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని అన్ని టోల్ ప్లాజాలకు పెరిగిన ధరలు వర్తింపు
దేశవ్యాప్తంగా అందరూ రేపు ప్రకటించబోయే లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తుండగా, అందరిని షాక్ కి గురిచేసేలా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) వినియోగాదారులకు ఝలక్ ఇచ్చింది. టోల్ ఛార్జీలపై ధరలకు 5% మేర పెంచింది. పెరిగిన టోల్ ధరలు మూడవ తేదీ నుంచి అమలులోకి రాగా, దీని ద్వారా టోల్ చార్జీలు రూ.5 రూపాయల నుంచి రూ.20 వరకు టోల్ చార్జీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 855 టోల్ ప్లాజాలు ఉండగా, అందులో 675 పబ్లిక్ ఫండ్ ప్లాజాలు ఉండగా, 180 టోల్ ప్లాజాలు ఇతర సంస్థల చేతుల్లో ఉన్నాయి.
ప్రతి ఏడాది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా టోల్ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం టోల్ ఛార్జీల పెంపులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెంచింది. దీంతో సగటు వినియోగదారునిపై పెను భారం పడనుంది. ప్రస్తుతం పెరిగిన టోల్ ఛార్జీలు 31 మార్చి,2025 వరకు అమలులో ఉంటాయి.
బైక్ రైడర్లకు గుడ్ న్యూస్
ఇండియాలో సగటున ఒక కారుకు నాలుగు బైక్స్ ఉన్నాయి. అయితే, టోల్ ఛార్జీలను పెంచినా సరే బైక్ ని వినియోగించే చేసే వారిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎలాంటి భారం మోపలేదు. బైక్ రైడర్లు యథావిధిగా హైవేలపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లవచ్చు. అయితే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న టోల్ ప్లాజాలలో పెరిగిన తర్వాత టోల్ ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి.
వెహికిల్ టైప్ | పంతంగి టోల్ ప్లాజా | పంతంగి టోల్ ప్లాజా | కొర్లపహాడ్ టోల్ ప్లాజా | కొర్లపహాడ్ టోల్ ప్లాజా | చిల్లకల్లు టోల్ ప్లాజా | చిల్లకల్లు టోల్ ప్లాజా |
సైడ్స్ | ఒక వైపు | రెండు వైపులా | ఒక వైపు | రెండు వైపులా | ఒక వైపు | రెండు వైపులా |
కారు, జీప్, వ్యాన్, లైట్ మోటార్ వెహికిల్ | రూ.95 | రూ. 145 | రూ. 130 | రూ. 195 | రూ. 110 | రూ. 160 |
లైట్ కమర్షియల్ వెహికిల్ | రూ. 150 | రూ. 230 | రూ. 205 | రూ. 310 | రూ. 170 | రూ. 255 |
బస్సు లేదా ట్రక్ | రూ. 315 | రూ. 470 | రూ. 430 | రూ. 640 | రూ. 355 | రూ. 530 |