- .ప్రస్తుత ఏడాదిలో 65.66% పెరిగిన 3-వీలర్ వెహికిల్ అమ్మకాలు
- ప్రతి నెలా 3-వీలర్ వెహికిల్స్ కు పెరుగుతున్న డిమాండ్
ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో 3-వీలర్స్ అమ్మకాలు అత్యధికంగా పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం 5,33,353 3-వీలర్ వెహికిల్స్ విక్రయించబడ్డాయి. గత సంవత్సరం సెప్టెంబరుతో పోలిస్తే 3-వీలర్స్ విక్రయాల్లో 65.66% పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
3-వీలర్ వెహికిల్స్ లో రిక్షాలు, ఆటోలు మరియు ఎలక్ట్రిక్ రిక్షా ఆటోలు ఉన్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశంలో 3-వీలర్ వెహికిల్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఈ విభాగంలో 83,925 3-వీలర్స్ విక్రయించబడ్డాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 3,21,96 3-వీలర్స్ అమ్ముడయ్యాయి. మేము ప్రస్తుత పెరుగుదల రేటు 65.66%ను రెండేళ్ల క్రితం డేటాతో పోల్చి చూస్తే, ఈ పెరుగుదల 535.51% గా ఉంది.
అసలు మూడు చక్రాల వాహనాల అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి?
3-వీలర్స్ కు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 3-వీలర్స్ కు డిమాండ్ పెరగడం వెనుక ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ మరియు ఇతర లాజిస్టిక్స్ సేవలకు ఈ వాహన వినియోగం పెరగడమే కారణమని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే, డోర్ స్టెప్ వద్దకే వస్తువులు మరియు సౌకర్యాలను డెలివరీ చేసే ధోరణి ఎంతగా అభివృద్ధి చెందితే, ఈ-రిక్షాలు మరియు ఆటోల అమ్మకాలు అంతగా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మహీంద్రా, బజాజ్, పియాజియో వంటి అనేక ప్రధాన బ్రాండ్లు ఈ విభాగంలో అమ్మకాలను పెంచడంలో తమ వంతు పాత్రను కీలకంగా పోషించాయి. ఇందులో మహీంద్రాకు చెందిన 7,133 ఈవీలు చేర్చబడ్డాయి. అదే సమయంలో, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే రిక్షాలు మరియు ఆటోలతో సహా బజాజ్ యొక్క కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాల్లో 60% పెరుగుదల ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్