- స్వరోవ్‌స్కీ క్రిస్టల్ డీఆర్ఎల్స్
- ప్రత్యేకమైన పెయింట్ ఆప్షన్స్ ను పొందిన X7 సిగ్నేచర్ ఎడిషన్
బిఎండబ్ల్యూ ఇండియా దాని ప్రస్తుత లైనప్ వెహికల్స్ ఆధారంగా మరో లిమిటెడ్ ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్లో ఈ రోజే లాంచ్ చేసింది.ఈ సారి కొత్త విశేషం ఏంటి అంటే,, ఇది X7 సిగ్నేచర్ ఎడిషన్, ఇది బిఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ కొత్త X7 సిగ్నేచర్ ఎడిషన్ ని రూ. 1.33 కోట్లు ధరతో, ఎస్‌యువి పెట్రోల్ 40ఐ ఎక్స్‌డ్రైవ్ వెర్షన్‌లో పొందవచ్చు. అలాగే, ఇది లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బయటి భాగంలో, బిఎండబ్ల్యూ క్రిస్టల్ హెడ్‌ల్యాంప్స్ ను పొందగా, కారు ముందు భాగంలో అమర్చిన స్వరోవ్‌స్కీ గ్లాస్-కట్ క్రిస్టల్ డీఆర్ఎల్స్ ఒక ప్రత్యేకమైన కాంతి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. లోపల భాగంలో, X7 సిగ్నేచర్ ఎడిషన్ స్టాండర్డ్ కారు వలె అదే అప్‍డేటెడ్ ను పొందుతుంది, అంటే వంపుతిరిగిన మెయిన్ డిస్‌ప్లే, డ్రైవర్-ఓరియెంటెడ్ కాక్‌పిట్ మరియు కొత్త యాంబియంట్ లైట్ బార్‌ను సెంటర్ స్టాక్ నుండి ప్యాసింజర్ దగ్గర వరకు పొడిగి ఉంటుంది.
ఈ కొత్త ఎడిషన్ కోసం, బిఎండబ్ల్యూ యాంబియంట్ ఎయిర్ ప్యాకేజీతో అందిస్తోంది, ఇందులో 15,000 ఇండివిజువల్ లైట్ పాయింట్లు ఉన్నాయి. లైట్ పాటర్న్ రూపొందించడానికి యాంబియంట్ లైటింగ్ సెట్టింగ్ ద్వారా వీటిని మార్చవచ్చు.అంతేకాకుండా, X7 మొత్తం ప్రత్యేక లుక్ ను జోడించడానికి క్రిస్టల్ డోర్ పిన్‌లను కూడా పొందుతుంది.
3.0-లీటర్, సిక్స్-సిలిండర్, ఇన్-లైన్ పెట్రోల్ ఇంజిన్ సిగ్నేచర్ ఎడిషన్‌కు పోలి ఉంటుంది. ఇది 1,800rpm మరియు 5,000rpm మధ్య 381bhp మరియు 520Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎస్‌యువి కేవలం 5.8 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుంది. అదనంగా, ఇంజిన్ 48V ఎలక్ట్రికల్ మోటారును కలిగి ఉంది, ఇది 12bhp పవర్ అవుట్‌పుట్ మరియు 200Nm టార్క్ అవుట్‌పుట్‌తో మరింత ఫ్యూయల్ ఎఫిషియన్సీ అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప