- ఇండియాలో రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభంకానున్న ధరలు
- సిఎన్‍జి టైప్ లో కూడా లభ్యం
ఎవరైతే కస్టమర్స్ కాంపాక్ట్ సెడాన్ ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారో వారికి టాటా టిగోర్ ఒక మంచి పాపులర్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది XE, XM, XZ, మరియు XZ+ అనే 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అలాగే ఈ సెడాన్ ధరలు రూ. 6.30 లక్షలు నుండి రూ. 8.95 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. ఇప్పుడు మనం కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్ యొక్క వెయిటింగ్ పీరియడ్ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం, ఈ 5-సీటర్ సెడాన్ పై ముంబై మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో ఒక నెల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ వెయిటింగ్ పీరియడ్ డీలర్ షిప్, సెలెక్ట్ చేసుకున్న వేరియంట్, కలర్, మరియు ఇతర అంశాల బట్టి మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న అధికారిక డీలర్ షిప్ ని సంప్రదించగలరు.
ఇక ఇందులో ఉన్న ఇంజిన్ విషయానికి వస్తే, టాటా టిగోర్ యొక్క 1.2-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 85bhp పవర్ మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్స్ దీని మోటారును 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి యూనిట్ తో కాన్ఫిగర్ చేయవచ్చు. అలాగే సిఎన్‍జి వేరియంట్ లో కూడా దీనిని అందిస్తుండగా, 72bhp మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే జత చేయబడి వచ్చింది.
ఇక పోటీ విషయానికి వస్తే, టాటా టిగోర్ మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, మరియు హోండా అమేజ్ వంటి మోడల్స్ తో పోటీ పడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్