- ఇండియాలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ని పొందిన మొదటి సిఎన్‍జి కార్లు ఇవే
- త్వరలో లాంచ్ అయ్యే అవకాశం
మరికొన్ని వారాల్లో టాటా టిగోర్ మరియు టియాగో సిఎన్‍జి కార్ల లాంచ్ ఒకేసారి జరగనుండగా, వాటి కొత్త వేరియంట్లకు సంబంధించిన కొంత సమాచారాన్ని టాటా మోటార్స్ ప్రదర్శించింది. టాటా కంపెనీ తన లైనప్ లో ఆటోమేటిక్ వేరియంట్లను పరిచయం చేయడానికి అంతా సిద్ధం చేస్తుంది.
ఇండియాలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లో అందించబడుతున్న మొదటి సిఎన్‍జి కార్లుగా టిగోర్ మరియు టియాగో సిఎన్‍జి మోడల్స్ నిలవగా, ఇవి ఎఎంటి యూనిట్లలో వచ్చే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ XT మరియు XZ+ వేరియంట్లలో అందించబడవచ్చని మేము భావిస్తున్నాము.
ప్రస్తుతం టాటా టియాగో సిఎన్‍జి మరియు టిగోర్ సిఎన్‍జి కార్లు 1.2-లీటర్, 3-సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ తో 72bhp పవర్మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ఇంజిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే జత చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్