- 2022లో టియాగో ఈవీ లాంచ్
- 2025లో టాటా నుంచి టాప్-10 ఈవీలలో ఒకటిగా నిలువనున్న టియాగో ఈవీ
కార్ మేకర్ నుంచి మొదట్లో అందించబడిన ఈవీ కార్లలో టాటా టియాగో ఈవీ కారు ఒకటిగా వచ్చి, సరికొత్త మైల్ స్టోన్ ని చేరుకుంది. కార్ మేకర్ ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 50 వేలకు పైగా కస్టమర్లకు టియాగో ఈవీ కారు డెలివరీ చేయబడింది.
టియాగో ఈవీ సెప్టెంబర్-2022లో లాంచ్ కాగా, టాటా నుంచి అందించబడుతున్న ఐదు ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా కంపెనీ పోర్ట్ ఫోలియోలో నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, X-ప్రెస్ టి, పంచ్ ఈవీ, అలాగే లేటెస్టు మోడల్ కర్వ్ వంటి కార్లు ఉన్నాయి. వీటికి తోడుగా వచ్చే సంవత్సరంలో హారియర్ ఈవీ, సఫారీ ఈవీ, అవిన్యా, మరియు సియెర్రా ఈవీ వంటి కార్లు రానున్నాయి.
ఇంకా చెప్పాలంటే, టాటా టియాగో ఈవీ కారు మొత్తంగా XE, XT, XZ+, మరియు XZ+ లక్స్ వంటి నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ కారును టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రోపికల్ మిస్ట్, ప్రిస్టిన్ వైట్, మరియు మిడ్ నైట్ ప్లమ్ వంటి ఐదు కార్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. టియాగో ఎలక్ట్రిక్ కారు 19.2kWh యూనిట్ మరియు 24kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ లలో అందించబడుతుంది. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని టాటా కంపెనీ పేర్కొంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, టియాగో ఈవీ కారును మేము డ్రైవ్ చేశాము, దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ మా వెబ్ సైట్ తో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్