- ఇండియాలో రూ. 7.90 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
- 4 వేరియంట్లలో లభ్యమవుతున్న మోడల్
ఇండియన్ ఆటోమేకర్ తాజాగా టాటా టిగోర్ మరియు టియాగో సిఎన్‍జి ఎఎంటి మోడళ్ళను అందిస్తుంది. ఇండియాలో మొదటి సిఎన్‍జి కార్లుగా వచ్చిన వీటిని ఆటోమేటిక్ గేర్ బాక్సుతో పొందవచ్చు. అయితే, తాజాగా ఆటోమేకర్ టియాగో సిఎన్‍జి ఎఎంటి యొక్క క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని వెల్లడించింది. ఇప్పుడు మనం ఆర్టికల్ లో, దీని రియల్-వరల్డ్ మైలేజీ ఎంత ఉందో తెలుసుకుందాం.
టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి రియల్-వరల్డ్ మైలేజీ:
ముందుగా మేము అనుకున్న విధంగా సిటీలో ఒక రూట్ ని ఎంచుకుని, సాధారణ కండిషన్స్ లో సిఎన్‍జి హ్యచ్ బ్యాక్ ని 46.5 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేశాము, అప్పుడు టియాగో సిఎన్‍జి ఎఎంటి 21.1 కిలోమీటర్లు/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. మరోవైపు, దీనిని మేము హైవేలపై దాదాపుగా 44.5 కిలోమీటర్లు డ్రైవ్ చేయగా, 22 కిలోమీటర్లు/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. మొత్తం మీద ఈ రెండు కలిపి 21.55 కిలోమీటర్లు/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. పోల్చి చూస్తే, ఈ కారు యొక్క మాన్యువల్ సిఎన్‍జి వేరియంట్ సిటీలో మరియు హైవేలపై వరుసగా 17 కిలోమీటర్లు/కేజీ మరియు 33 కిలోమీటర్లు/కేజీ రియల్ వరల్డ్ మైలేజీని అందించింది.
టాటా టియాగో సిఎన్‍జి మాన్యువల్ వర్సెస్ ఆటోమేటిక్ మైలేజీ (కార్‌వాలే టెస్ట్):
మేము ఇంతకుముందు టియాగో మాన్యువల్ సిఎన్‍జి వేరియంట్‌ని టెస్ట్ చేశాము మరియు కొత్త సిఎన్‍జి ఎఎంటి వేరియంట్ ని టెస్ట్ చేశాము. ఇది ఎలా పనిచేసిందో ఇక్కడ చూడవచ్చు:
రియల్-వరల్డ్ మైలేజీ (కార్‌వాలే టెస్ట్) | టియాగో సిఎన్‍జి మాన్యువల్ | టియాగో సిఎన్‍జి ఎఎంటి |
సిటీ మైలేజీ | 17 కిమీ/కిలో | 21.1 కిమీ/కిలో |
హైవే మైలేజీ | 33 కిమీ/కిలో | 22 కిమీ/కిలో |
టియాగో సిఎన్‍జి ఎఎంటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ పెట్రోల్ మోడ్ లో 85bhp మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, సిఎన్‍జి మోడ్ లో 72bhp మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఫ్రంట్ వీల్స్ కి 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ ద్వారా పవర్ ని అందిస్తుంది.
మేము ఈ కారును డ్రైవ్ కూడా చేశాము, దానికి సంబంధించిన రివ్యూ మా కార్‌వాలే వెబ్ సైట్ ని సందర్శించి చదువుకోగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్