- 20 లక్షల ఎస్యూవీ సేల్స్ మైల్ స్టోన్ ని సెలెబ్రేట్ చేయడానికి అందిస్తున్న టాటా
- ఐసీఈ మరియు ఈవీలపై భారీగా లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్స్
టాటా మోటార్స్ ఇండియాలో 20 లక్షల ఎస్యూవీ సేల్స్ ద్వారా అతిపెద్ద ల్యాండ్ మార్కును చేరుకుంది. ఈ ఘనతను సెలెబ్రేట్ చేయడానికి, ఆటోమేకర్ దేశవ్యాప్తంగా ఉన్న దాని ఎస్యూవీ పోర్ట్ ఫోలియోపై రూ. 1.4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది.
ప్రస్తుతం, ఇండియన్ ఆటోమేకర్ పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, పంచ్ ఈవీమరియు నెక్సాన్ ఈవీఅనే ఆరు ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇంకా డిస్కౌంట్ల విషయానికొస్తే, హారియర్ మరియు సఫారీలపై ధర తగ్గగా, దాని పాటుగా రూ.1.4 లక్షల వరకు బెనిఫిట్స్ ని టాటా అందిస్తుంది. మరోవైపు, నెక్సాన్ ఈవీమరియు పంచ్ ఈవీలు వరుసగా రూ. 1.3 లక్షలు మరియు రూ. 30,000 వరకు బెనిఫిట్స్ తో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఆఫర్లు లిమిటెడ్ పీరియడ్ వరకు అందుబాటులో ఉంటుండగా, 31 జూలై, 2024 వరకు చేసిన బుకింగ్స్ కి వర్తిస్తాయి.
ఈ ప్రత్యేక సందర్భంగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ “ఎస్యూవీ సెగ్మెంట్‌ను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం మరియు ప్రతి కస్టమర్ అవసరానికి అనుగుణంగా ప్రొడక్టులను అందించడం ద్వారా మా కెపాసిటీని, సెగ్మెంట్లో స్థిరత్వం మరియు లీడర్ షిప్ ని కొనసాగించడానికి మాకు ఎంతో సహాయపడుతుంది.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్