- ఇంతకు ముందు 10 వారాలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్
- ఇండియాలో రూ. 16.19 లక్షలతో(ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
టాటా మోటార్స్ అక్టోబర్ 2023లో ఇండియన్ మార్కెట్లో కొత్త సఫారీని లాంచ్ చేసింది. హారియర్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు లాంచ్ చేయబడిన ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‍యూవీఏడు ఎక్స్‌టీరియర్ కలర్లలో మొత్తం 10 వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ మోడల్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 16.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ప్రస్తుతం, ఎవరైతే కస్టమర్లు ఫేస్‌లిఫ్టెడ్ సఫారీని కొనాలని భావిస్తున్నట్లయితే వారు బుకింగ్ చేసిన తేదీ నుండి తమ కారు డెలివరీ కోసం నాలుగు నుండి ఆరు వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్ ముంబై ప్రాంతానికి వర్తిస్తుంది మరియు వేరియంట్, కలర్, డీలర్షిప్ మరియు ఇతర అంశాలను బట్టి ఇది మారే అవకాశం ఉంది..
లేటెస్ట్ గా, బ్రాండ్ టాటా సఫారీ యొక్క రెడ్ డార్క్ ఎడిషన్‌ను కూడా ప్రదర్శించింది. దీని లుక్స్ చూస్తుంటే, మహీంద్రా XUV700-పోటీ పడుతున్న ఈ మోడల్ గ్లోసీ ఫినిష్ తో మిడ్‌నైట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్లో పెయింట్ చేయబడింది. అంతే కాకుండా, ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ వద్ద రెడ్ ఇన్సర్ట్స్, రెడ్ కలర్ లో పెయింట్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బ్రేక్ కాలిపర్స్ మరియు టెయిల్‌గేట్‌పై రెడ్-పెయింటెడ్ సఫారీ బ్యాడ్జింగ్‌ను పొందింది. క్యాబిన్ విషయానికొస్తే, టాటా ఎస్‍యూవీ లోపల అదే థీమ్‌ను కలిగి ఉంది. డ్యాష్‌బోర్డ్ రెడ్ యాక్సెంట్స్ మరియు చుట్టూ డార్క్ బ్యాడ్జింగ్‌తో చుట్టూ అంతటా ఫుల్లీ-బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ని కలిగి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్