- ప్యూర్ వేరియంట్ వివిధ ఫీచర్ల తొలగింపు; కొత్తగా వచ్చిన టచ్ స్క్రీన్ మరియు మరెన్నో ఫీచర్లు
- ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా లభ్యం
సఫారీ కారులో లభిస్తున్న ఫీచర్ల లిస్టులో టాటా మోటార్స్ వివిధ మార్పులు చేయగా, వాటిని తక్షణమే అమలు చేస్తున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అప్ డేట్ లో భాగంగా, ప్యూర్ వేరియంట్ వివిధ ఫీచర్లను కోల్పోయింది. ముఖ్యంగా, ఈ వేరియంట్ ధరలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
లీకైన డాక్యుమెంట్ ప్రకారం, సఫారీ ప్యూర్ వేరియంట్ లో చాలా ఫీచర్లను మిస్ అవ్వనున్నారు. అందులో మూడవ వరుసలో ఏసీ వెంట్స్, ఆర్మ్ రెస్ట్, స్పేర్ వీల్, రెండవ మరియు మూడవ వరుసలో రూఫ్ లైట్స్, టిపిఎంఎస్, మరియు ఎల్ఈడీ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అదే విధంగా, మూడు వరుసల ఎస్‍యూవీ ప్యూర్ వేరియంట్లో టాటా అందించిన షార్క్-ఫిన్ యాంటెన్నా, రివర్స్ పార్కింగ్ కెమెరా, మరియు 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, సఫారీ మాన్యువల్ యూనిట్లో ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍వీఎం ఫీచర్ రీప్లేస్ చేయబడింది. ఇంకా చెప్పలంటే, సఫారీ ప్యూర్ వేరియంట్ ధరలు రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమయ్యాయి.
మూలం
అనువాదించిన వారు: సంజయ్ కుమార్