- దీంతో పాటుగా లాంచ్ అయిన నెక్సాన్, నెక్సాన్ ఈవీ, మరియు హారియర్ డార్క్ ఎడిషన్స్
- ఇప్పుడు ఓబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్లో వచ్చిన బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్స్
టాటా మోటార్స్ హారియర్ మరియు సఫారీ డార్క్ ఎడిషన్లతో పాటుగా ఇప్పుడు కొత్త ఎస్‍యూవీ డ్యూయో నెక్సాన్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్ ని ప్రవేశపెట్టి #Dark లెగసీని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. టాటా సఫారీ యొక్క కొత్త డార్క్ కలర్ ఎక్స్-షోరూం ధర రూ.20.69 లక్షలతో ప్రారంభమైంది. ఈ ఆర్టికల్ లో, సఫారీ డార్క్ ఎడిషన్ యొక్క టాప్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం.
ఎక్స్‌టీరియర్:
పేరులో సూచించిన విధంగా సఫారీ డార్క్ ఎడిషన్ ఓబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్లో పియానో బ్లాక్ గ్రిల్ తో వచ్చింది. 19-ఇంచ్ ఏరో-స్టైల్డ్ అల్లాయ్ వీల్స్ పూర్తిగా కలర్లో వచ్చాయి. తర్వాత, ఎస్‍యూవీ యొక్క ఫ్రంట్ ఫెండర్లపై #Dark బ్యాడ్జెస్ ని కలిగి ఉంది.
ఇంటీరియర్:
ఎక్స్‌టీరియర్ లాగానే, ఇంటీరియర్లో కూడా బ్లాక్ కలర్ ని సఫారీ క్యాబిన్‌లో కూడా చూడవచ్చు, ఇది ఇప్పుడు క్యాబిన్ లోని వివిధ ప్రదేశాలలో పియానో బ్లాక్ ఇన్‌సర్ట్‌లతో బ్లాక్‌స్టోన్ ఇంటీరియర్ థీమ్‌ను పొందింది. ఇంకా చెప్పాలంటే, హెడ్ రెస్ట్స్ పై #Dark మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఫీచర్స్:
ఫీచర్స్ పరంగా చెప్పాలంటే, సఫారీ డార్క్ ఎడిషన్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 7 ఎయిర్‌బ్యాగ్స్, 10-స్పీకర్ జెబిఎల్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, టచ్-బేస్డ్ హెచ్‍విఎసిప్యానెల్ మరియు లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ వంటి అద్బుతమైన ఫీచర్స్ తో వచ్చింది.
పవర్ ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్:
మెకానికల్ గా, కొత్త డార్క్ అవతార్ లో వచ్చిన ఎస్‍యూవీలో ఇంతకు ముందు ఉన్నట్లు గానే 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్లతో జతచేయబడి వచ్చింది. ఈ ఇంజిన్ 168bhp మరియు 350Nm పీక్ టార్కును ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్