- టాటా సఫారీపై లభిస్తున్న అత్యధిక డిస్కౌంట్స్
- 2023 మోడల్స్ పై డిస్కౌంట్స్ లభ్యం
ఆగస్టు-2024లో టాటా మోటార్స్ దాని పూర్తి రేంజ్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ ఆఫర్లు 2023 మోడల్స్ కి మాత్రమే పరిమితం కాగా, ఈ ఆర్టికల్ ద్వారా, ఈ నెలలో హారియర్ మరియు సఫారీ మోడల్స్ ని కొనుగోలు చేసేవారికి లభించే అత్యధిక బెనిఫిట్స్ వివరాలను పరిశీలిద్దాం.
సఫారీ 2023 మోడళ్లను ఎంచుకునే కస్టమర్లకు దీని అన్ని వేరియంట్లపై రూ. 1.65 లక్షలు వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. హారియర్ మోడల్ పై రూ. 1.45 లక్షలు వరకు బెనిఫిట్స్ లభిస్తుండగా, మీరు ఎంచుకునే వేరియంట్‌ని బట్టి ఈ ఆఫర్లు లభిస్తాయి. ప్రస్తుతం, టాటా సఫారీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.16.19 లక్షలు ఉండగా, హారియర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.14.99 లక్షలుగా ఉంది.
మెకానికల్ గా, రెండు మోడళ్లలో 2.0-లీటర్ క్రయోటెక్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ని 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేసి పొందవచ్చు. ఈ మోటార్ 168bhp మరియు 350Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇతర వార్తలలో చూస్తే, టాటా కర్వ్ మోడల్ 2024 ఆగష్టు 7వ తేదీన ఐసీఈ మరియు ఈవీ అనే రెండు వెర్షన్లలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. టాటా నుండి వస్తున్న ఈ కొత్త కూపే ఎస్‍యూవీ బ్రాండ్ కొత్త 1.2-లీటర్ హైపీరియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కలిపి వస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్