- ఇండియాలో రూ.6.13 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ధరలు ప్రారంభం
- మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సులతో లభిస్తున్న టాటా పంచ్
టాటా మోటార్స్ దాని ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీ పంచ్ ని 2021లో ఇండియాలో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి, హ్యుందాయ్ ఎక్స్‌టర్ తో పోటీపడుతున్న ఈ మోడల్ కి కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున అద్బుత స్పందన రావడంతో బాగా పాపులర్ అయింది. ఇండియన్ మార్కెట్లో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ బాగా పెరగడంతో, దీనిపై కొంతవరకు వెయిటింగ్ పీరియడ్ ఉండడం ప్రారంభమైంది.
ప్రస్తుత నెలలో, పంచ్ పై బుకింగ్ చేసిన తేదీ నుంచి 4-6 వారాల పాటు వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతుంది. ముఖ్యంగా, ఈ వెయిటింగ్ పీరియడ్ ముంబై సిటీకి మాత్రమే వర్తించనుండగా, వేరియంట్, కలర్, డీలర్ షిప్, పవర్ ట్రెయిన్, గేర్ బాక్స్, మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే మీకు దగ్గరలో ఉన్న అధికారిక డీలర్ షిప్ ని సంప్రదించగలరు.
ఇతర వార్తలలో చూస్తే, గత నెలలో టాటా మోటార్స్ పంచ్ లైనప్ లో ఉన్న వేరియంట్లలో మార్పులు చేసింది. తాజాగా ఆటోమేకర్ మూడు కొత్త వేరియంట్లను టాటా పంచ్ లైనప్ కి జత చేసింది. కొత్త వేరియంట్లలో క్రియేటివ్ ఎంటి, క్రియేటివ్ ఫ్లాగ్ షిప్ ఎంటి, మరియు క్రియేటివ్ ఎఎంటి వేరియంట్లు ఉన్నాయి. కామో ఎడిషన్ కి చెందిన అన్ని వేరియంట్లను తొలగించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్