- అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్
- పెట్రోల్ మరియు సిఎన్‍జి ఆధారితమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
ప్రస్తుత కాలంలో టాటా పంచ్ ఇండియన్ ఆటోమేకర్ నుండి బెస్ట్ సెల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ మైక్రో-ఎస్‍యూవీ ప్రస్తుతం 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, అవి ఏవి అంటే, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్. ప్రస్తుతం దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షలుగా ఉంది. ఈ ఆర్టికల్ లో, మేము నవంబర్ 2023లో పంచ్ పై ఉన్న లేటెస్ట్ వెయిటింగ్ పీరియడ్ లిస్టును మీకోసం పొందుపరుస్తున్నాము.
పంచ్ పెట్రోల్ వేరియంట్స్ ను బుక్ చేసుకున్న కస్టమర్లు బుకింగ్ చేసిన తేదీ నుండి కేవలం 3 నుండి 4 వారాల వరకు మాత్రమే వేచి ఉండాల్సి ఉంటుంది. మరోవైపు, సిఎన్‍జి-బేస్డ్ వేరియంట్స్ కోసం ప్లాన్ చేస్తున్న కస్టమర్స్ వెహికిల్ డెలివరీని పొందడానికి 3 నుండి 12 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ తాత్కాలిక వెయిటింగ్ పీరియడ్ లొకేషన్, డీలర్‌షిప్, అందుబాటులో ఉన్నస్టాక్ మరియు ఇతర అంశాలపై ఆధారపడి మారే అవకాశం కూడా ఉంది.
మెకానికల్ గా, టాటా పంచ్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు కంపెనీ ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో కూడా వస్తుంది. దీని మోటారు, స్టాండర్డ్ మోడ్‌లో84bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, సిఎన్‍జి ఆప్షన్ ఇంజిన్ 72bhp మరియు 103Nm టార్క్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా ట్యూన్ చేయబడింది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, దీని ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ యూనిట్‌తో జత చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్