- జూలై 16న లాంచ్ అయిన ఎక్స్‌టర్ హై- సిఎన్‍జి డ్యూయో
- సెగ్మెంట్లో ట్విన్ సిఎన్‍జి సిలిండర్ టెక్నాలజీని పొందిన మొదటి కారు పంచ్
హ్యుందాయ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ట్విన్ సిఎన్‍జి సిలిండర్లతో ఎక్స్‌టర్ కారును లాంచ్ చేయగా, వీటి ధరలు రూ. 8.50 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమయ్యాయి. హై- సిఎన్‍జి డ్యూయోగా పిలువబడుతున్న కొత్త టెక్నాలజీ డెరివేటివ్ సింగిల్ సిఎన్‍జి సిలిండర్ తో పాటుగా విక్రయించబడుతుంది. అలాగే ఈ టెక్నాలజీని దాని రేంజ్ లో ఉన్న గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరా వంటి సిఎన్‍జి కార్లలో తీసుకువస్తుందని అంచనా వేస్తున్నాం.
ఇక్కడ మీకు తెలియాల్సిన అంశం ఏంటి అంటే, హ్యుందాయ్ కంపెనీ ఒక్కటే ఈ టెక్నాలజీని తీసుకురాలేదు. ఇంతకు ముందుగా టాటా కంపెనీ టియాగో, టిగోర్ మరియు ఎక్స్‌టర్ తో పోటీపడుతున్న పంచ్ వంటి కార్లలో ఈ టెక్నాలజీని తీసుకువచ్చింది. అయితే, బి-ఎస్‍యూవీ సెగ్మెంట్లో అందించబడిన ఈ రెండు కార్ల టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
ముందుగా ఎక్స్‌టర్ కారుతో ప్రారంభిస్తే, ఈ మోడల్ 1.2-లీటర్, బై-ఫ్యూయల్ (పెట్రోల్ మరియు సిఎన్‍జి) మోటారుతో రాగా, ఇది 68bhp మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా పంచ్ కారు, దాని సిఎన్‍జి టైప్ లో 72bhp మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కార్లు కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మైలేజీ పరంగా చూస్తే, టాటా పంచ్ ఐసిఎన్‍జి 26.99కి.మీ./కేజీ మైలేజీని అందిస్తుండగా, హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై- సిఎన్‍జి కారు 27.1కి.మీ./కేజీ మైలేజీని అందిస్తుంది. ఈ రెండు సిఎన్‍జి కార్ల మైలేజీలో చాలా తక్కువ మొత్తంలో తేడా ఉన్నా, రెండు కార్లు ఒకే రకమైన మైలేజీని అందిస్తున్నాయి. కానీ, మేము మీకు సూచిస్తుంది ఏంటి అంటే, రాబోయే (అప్ కమింగ్) నెలల్లో ఈ రెండు కార్ల రియల్-వరల్డ్ మైలేజీని మేము టెస్ట్ చేయబోతున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్