- ఇండియాలో రూ.6 లక్షలతో ప్రారంభంకానున్న పంచ్ ధరలు
- అందుబాటులో ఉన్న పెట్రోల్ మరియు సిఎన్జి పవర్‌ట్రెయిన్స్
టాటా మోటార్స్ దేశం అంతటా పంచ్ బి-ఎస్‌యువిని అక్టోబర్ 2021లో ప్రవేశపెట్టింది, దీనిని రూ. 5.49 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) పొందవచ్చు. ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ. 6 లక్షల నుండి ఎంట్రీ-లెవల్ ప్యూర్ ఎంటీ వేరియంట్ లో అందుబాటులో ఉంది.
ఇటీవలే పంచ్ ఇండియాలో 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఈ మోడల్ ధర వెల్లడి అయిన తర్వాత సుమారు 10 నెలల తర్వాత ఆగస్టులోఇది లక్ష యూనిట్ల మైలురాయిని అధిగమించింది. అదే విధంగా,మే 2023లో రెండు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయబడి తదుపరి మైలురాయిని కూడా అధిగమించింది. వైట్ రూఫ్ తో టోర్నాడో బ్లూ అనే హై వేరియంట్ సెలబ్రేటరీ యూనిట్డ్యూయల్-టోన్ షేడ్‌లో ఈ సంవత్సరం విడుదల చేయబడింది.
టాటా పంచ్ ప్రస్తుతం ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్ అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ను కస్టమర్లు లాంగ్ రేంజ్ లో 7 కలర్స్ ఆప్షన్స్ ద్వారా ఎంచుకోవచ్చు. మెకానికల్‌గా చూస్తే, హ్యుందాయ్ ఎక్స్టర్ తో పోటీ పడుతున్న టాటా పంచ్ 1.2-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఎఎంటి యూనిట్‌తో జత చేయబడింది. అంతే కాకుండా సిఎన్జి వెర్షన్లో కూడా ఇది అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప