- రీడిజైన్డ్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ ని పొందనున్న పంచ్ ఫేస్‍లిఫ్ట్
- ఈవీ వెర్షన్ లాగే అనిపిస్తున్న ఫేస్‍లిఫ్ట్ ఫీచర్స్
ప్రస్తుతం టాటా మోటార్స్ ఈ సంవత్సరంలో కొత్త మోడల్స్ ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇండియన్ ఆటోమేకర్ అయిన టాటా కంపెనీ కర్వ్, హారియర్ మరియు సఫారీ ఈవీ వంటి మోడల్స్ ని, అదే విధంగా పంచ్ ఐసీఈ యొక్క ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ని కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇక చివరిగా చెప్పినది అంటే, పంచ్ ఈవీకి పోటీగా ఉన్న టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్ మొదటిసారి కనిపించింది.
ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, ఇటీవల లాంచ్ అయిన ఎస్‍యూవీల లాగే ఈ ఆటోమేకర్ అప్‍డేటెడ్ పంచ్ బెస్ట్ ఫీచర్లతో పూర్తి రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను పొందనుంది. ఇది ఒక సన్నని ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఫ్లాంకింగ్ గ్రిల్ తో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఫీచర్ ని పొందనుంది. తర్వాత, రేడియేటర్ గ్రిల్ మరియు బంపర్ కొద్దిగా ట్వీక్ చేసినట్లుగా ఉండి పంచ్ లుక్ ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ తో వస్తుందని మేము భావిస్తున్నాము.
ఇంకా రియర్ ప్రొఫైల్ చూస్తే, పంచ్ ఫేస్‍లిఫ్ట్ వెనుక భాగంలో కొత్త కనిపించే రీడిజైన్డ్ బంపర్, వాషర్ తో రియర్ వైపర్,రియర్ స్పాయిలర్, మరియు ట్వీక్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఎస్‍యూవీ ప్రస్తుతమున్న వెర్షన్ లాగా ఫ్రంట్ వీల్స్ పై మాత్రమే కాకుండా అన్ని 4-వీల్స్ పై నాలుగు డిస్క్ బ్రేక్స్ తో రానుంది.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, అప్‍డేటెడ్ ఎస్‍యూవీ ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన కొత్త ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టచ్-బేస్డ్ హెచ్‍విఎసిప్యానెల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ మరియు అప్‌డేట్ చేయబడిన సీట్ అప్హోల్స్టరీతో కూడిన కొత్త ఇంటీరియర్ ట్రిమ్ ఆప్షన్ వంటి ఫీచర్లను పొందనుంది.
మెకానికల్ గా, పంచ్ ఇంతకు ముందు లాగే ఇందులో కూడా 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి రానుంది. ఈ మోటార్ 85bhp మరియు 113Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో అందించబడే అవకాశం ఉంది.
లాంచ్ అయిన తర్వాత, పంచ్ ఫేస్‍లిఫ్ట్ హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి ఫ్రాంక్స్, మారుతి ఇగ్నిస్, మరియు త్వరలో ఫేస్‍లిఫ్ట్ వెర్షన్లో రానున్న C3 హ్యచ్ బ్యాక్ తో పోటీ పడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్