- వచ్చే నెలలో లాంచ్ కాబోతున్న పంచ్ ఈవీ
- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో రానున్నట్లు అంచనా
వచ్చే నెలలో టాటా పంచ్ ఈవీ లాంచ్ కు ముందే, కొత్త టాటా పంచ్ ఈవీ తాజా స్పై షాట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. కొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో పాటు, ప్రస్తుత ఐసిఈ - పవర్డ్ పంచ్‌తో పోల్చితే ఈ మోడల్ అప్‌డేటెడ్ ఫాసియాతో రానుందని భావిస్తున్నారు.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, టాటా పంచ్ ఈవీ టెస్ట్ మ్యూల్ సెంటర్ కన్సోల్ పెద్ద ఫ్రీస్టాండింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ యూనిట్ ఈ సంవత్సరం ప్రారంభంలో నెక్సాన్ ఈవీ రేంజ్ లో 10.25-ఇంచ్ స్క్రీన్ మొదటిగా అరంగేట్రం చేసింది. మిగిలిన చోట్ల, ఇంటీరియర్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, గేర్ సెలెక్టర్‌గా పనిచేసే కొత్త రోటరీ డయల్ మరియు ముందు వరుసలో ఉండేవారికి ఆర్మ్‌రెస్ట్ రూపంలో అప్‌డేట్‌లను పొందుతుంది. బ్యాక్‌లిట్ టాటా లోగోతో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో పొందవచ్చు.
లోపలి భాగంలో చూస్తే, కొత్త డిఆర్ఎల్ఎస్, హెడ్‌ల్యాంప్స్, గ్రిల్ మరియు బంపర్‌లతో కొత్త పంచ్ ఈవీ అప్‌డేటెడ్ ఫాసియాను పొందుతుందని మేము భావిస్తున్నాం. టెస్ట్ మ్యూల్ ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉన్నప్పటికీ దీనిని ఐసిఈ డెరివేటివ్ వలె ఫ్యూయల్ ఫిల్లెర్ క్యాప్ లోపల ఉంచే అవకాశం ఉంది.
2023 టాటా పంచ్ ఈవీలో బ్యాటరీ ప్యాక్ స్పెసిఫికేషన్‌లను టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. ఇందులో మీడియం రేంజ్ మరియు లాంగ్ రేంజ్ విధానంలో టియాగో ఈవీ లాగే రెండు ఆప్షన్స్ లో వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు:రాజపుష్ప