- 2024 మొదటి త్రైమాసికంలో అరంగేట్రం చేసే అవకాశం
- టాటా టియాగో ఈవీ కంటే ముందుగా రానున్న పంచ్ ఈవీ
2024 ప్రారంభంలో టాటా మోటార్స్ పంచ్ ఈవీని ప్రపంచానికి పరిచయం చేయనుంది. అధికారిక లాంచ్ కు ముందు, ఈ టెస్ట్ మ్యూల్ మోడల్ ఎన్నోసార్లుగా మరియు పలు టెస్టింగ్ దశలలో కెమెరా కంటికి చిక్కింది. ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ టెస్టింగ్ చేస్తూ కనిపించగా, దీనికి సంబంధించి ఎన్నో విషయాలు బహిర్గతమయ్యాయి.
ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, ప్రస్తుత ఇటరేషన్ మోడల్ లో ఉన్నట్లుగా పంచ్ ఈవీలో స్పోర్ట్స్ ప్రొడక్షన్-రెడీ టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశాలలో డీఫాగర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, మల్టీ-స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్‌తో కూడిన రియర్ వైపర్ హైలైట్ గా నిలిచాయి. అంతే కాకుండా పంచ్ ఈవీస్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్ మరియు రివైజ్డ్ గ్రిల్ డిజైన్‌తో అదే సిల్హౌట్‌ను కొనసాగించనుంది.
తర్వాత, దీనిని దగ్గరగా పరిశీలిస్తే టెస్ట్ కార్ యొక్క డ్యాష్ బోర్డు భారీ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ని కలిగి ఉంది. టాటా పంచ్ ఈవీ యూనిట్ అంతా అచ్చం నెక్సాన్ ఈవీ లాగా కనిపిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రోటరీ గేర్ సెలెక్టర్ డయల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, యాంబియంట్ లైటింగ్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ ఉండవచ్చని మేము భావిస్తున్నాము.
ఇక బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, వీటికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేనప్పటికీ టిగోర్ ఈవీ లేదా నెక్సాన్ ఈవీ బ్యాటరీ యూనిట్ తో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 200-300 కి.మీ. రేంజ్ ని అందించవచ్చని భావిస్తున్నాం.
లాంచ్ అయిన తర్వాత, టాటా పంచ్ ఈవీ ఇండియాలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‍యూవీ సెగ్మెంట్ లో సిట్రోన్ eC3 పోటీపడే అవకాశం ఉంది.
ఫోటో క్రెడిట్స్: సారంగ్ గోటేచా
అనువాదించిన వారు: సంజయ్ కుమార్