- ఇండియాలో రూ. 10.99లక్షలతో పంచ్ ఈవీ ధరలు ప్రారంభం
- నెక్సాన్ ఈవీ రిజల్ట్స్ కూడా వెల్లడి
పంచ్ ఈవీమరియు నెక్సాన్ ఈవీలు పొందిన క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ ను సెట్ బిఎన్ క్యాప్ రిలీజ్ చేసింది. లేటెస్ట్ రౌండ్ టెస్ట్‌లలో పంచ్ ఈవీ 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. అలాగే, నెక్సాన్ రిజల్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
పంచ్ ఈవీ విషయానికి వస్తే, ఈ మోడల్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 32 పాయింట్లకు 31.46 పాయింట్లను మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 49 పాయింట్లకు 45 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, ఇక్కడ జరిగిన టెస్ట్‌లలో ఎంపవర్డ్+ S లాంగ్ రేంజ్వేరియంట్ పై టెస్టింగ్ అయినప్పటికీ, ఇక్కడ అందించినరేటింగ్ మీడియం-రేంజ్ మరియు లాంగ్-రేంజ్ మోడల్స్ లైనప్‌కు వర్తిస్తుంది.
అదనంగా, పంచ్ ఈవీ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 15.71 మరియు సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 15.74 స్కోర్ చేసింది.సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, ఈఎస్‍పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్ మరియు ఐటిపిఎంఎస్ వంటి మరిన్నిసేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప