- టెస్టింగ్ చేయబడిన పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ బ్యాటరీ ప్యాక్
- ఎంపవర్డ్ ప్లస్ ఎస్ లాంగ్ రేంజ్ 7.2kW ఫాస్ట్ ఛార్జర్ వేరియంట్ ధర రూ.15.49 లక్షలు (ఎక్స్-షోరూం)
జెన్-2 ఆర్కిటెక్చర్
టాటా పంచ్ ఈవీ ఇండియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఈవీ కాగా, ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, నెక్సాన్, టియాగో, మరియు టిగోర్ లాంటి ఎలక్ట్రిక్ వెర్షన్లలా కాకుండా, కొత్త పంచ్ ఈవీ టాటా జెన్-2 ఆర్కిటెక్చర్ ఆధారంగా రాగా, ఇది కారులో స్పేస్ సామర్థ్యాన్ని మరింత అందిస్తుంది. మరింత ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే, పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని టాటా పేర్కొంది. కానీ, రియల్ వరల్డ్ మైలేజీ చూస్తే దానికి విరుద్ధంగా ఉంది. మేము నిర్వహించిన కాంప్రహెన్సివ్ రేంజ్ టెస్టులో పంచ్ ఈవీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం.
టెస్ట్ ప్రోటోకాల్స్
మా స్టాండర్డ్ టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం, పంచ్ ఈవీ కారును స్టార్ట్ చేసి స్టాండర్డ్ మోడ్ లో డ్రైవ్ చేశాము. పంచ్ ఈవీని సిటీ డ్రైవ్ మోడ్ లో ఉంచి మరియు బ్రేకింగ్ ఎనర్జీ లెవెల్ ని ఒకటిలో ఉంచాము. అదే విధంగా, టెస్టు పూర్తిగా అయిపోయేంత వరకు ఏసీ టెంపరేచర్ ని 21 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మధ్య సెట్ చేశాము. పంచ్ ఈవీ ద్వారా చాలా వరకు ఈ టెస్టును సిటీ లిమిట్స్ లో మరియు మిగతా టెస్టును హైవేపై నిర్వహించాము. అన్నింటిని దృష్టిలో ఉంచుకొని, టాటా పంచ్ ఈవీ బ్యాటరీ అంతా పూర్తి అయ్యే వరకు కేవలం 259.8 కిలోమీటర్ల రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని మాత్రమే అందించింది మరియు కారును దాని పవర్ సహాయంతో స్టార్ట్ చేయగా ముందుకు కదలలేదు.
వెల్లడైన పూర్తి మైలేజీ వివరాలు
టెస్టు ద్వారా మేము గుర్తించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈవిధంగా ఉన్నాయి. మొదటగా, ప్రతి ఒక్క ఈవీ కారు స్టార్ట్ అయ్యే సమయంలో కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ ని కోల్పోతుంది. పంచ్ ఈవీ విషయానికి వస్తే, ఇది 10 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ ని కోల్పోగా మాక్సిమం స్పీడ్ లో డ్రైవ్ చేయబడింది. తర్వాత మరోసారి 55 కెఎంపిహెచ్ వేగం వద్ద రికార్డు చేశాము. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, కారు బ్యాటరీ ప్యాక్ 7 శాతం వరకు తగ్గగా, ఏసీ మాత్రం అలానే ఉంది. ఇక ఫైనల్ గా మేము నిర్వహించిన టెస్టులో టాటా క్లెయిమ్ చేసిన 421 కిలోమీటర్లలో పంచ్ ఈవీ 61 శాతం మైలేజీని మాత్రమే అందించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్