- 5 వేరియంట్లలో లభ్యం
- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందిన పంచ్ ఈవీ
టాటా మోటార్స్ తన పంచ్ ఈవీని రూ. 10.99 లక్షలు(ఎక్స్-షోరూం)తో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. ప్రస్తుతం, దీనిని 5 వేరియంట్లలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో పొందవచ్చు. ఈ కొత్త మోడల్ రాకతో ఇండియన్ ఆటోమేకర్ అయిన టాటా ప్రస్తుతం తన పోర్ట్ ఫోలియోలో 4 ఆల్-ఎలక్ట్రిక్ మోడల్స్ ని కలిగి ఉంది.
ఎక్స్‌టీరియర్ పరంగా, బయట వైపు పంచ్ ఈవీ తన ఐసీఈ వెర్షన్ లాగానే కొనసాగిస్తుంది. మొత్తానికి చూస్తే, డిజైన్ పరంగా కొన్నింటిని నెక్సాన్ ఈవీ నుండి తీసుకున్నట్లు అనిపిస్తుంది. అందులో బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ పై ముందు పూర్తి-వెడల్పైన ఎల్ఈడీ లైట్ బార్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో వర్టికల్ స్లాట్ ప్యాటర్న్ గ్రిల్ మరియు ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అదనంగా, నెక్సాన్ ఈవీ లాగా కాకుండా, పంచ్ ఈవీలో ఛార్జింగ్ ఫ్లాప్ మోటరైజ్డ్ ఓపెనింగ్/క్లోజింగ్ మెకానిజంతో కారు ముందు భాగంలో అమర్చబడి ఉంటుంది.
కలర్ ఆప్షన్ల పరంగా చూస్తే, టాటా పంచ్ ఈవీని మొత్తం 6 కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. అందులో 1 మోనోటోన్ కలర్ ఉండగా, సీవీడ్ గ్రీన్, డేటోనా గ్రే, ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్ మరియు ప్రిస్టిన్ వైట్ అనే ఇతర డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి.
ఫీచర్స్ పరంగా, ఐసీఈ వెర్షన్ తో పోలిస్తే టాటా బ్రాండ్ పంచ్ ఈవీలో మరిన్ని ఫీచర్లను అందించింది. ఇందులో పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు టచ్ కెపాసిటివ్ బటన్లతో రీడిజైన్డ్ హెచ్‍విఎసిప్యానెల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, జ్యువెల్డ్ గేర్ సెలెక్టర్ డయల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంది.
టాటా పంచ్ ఈవీ యొక్క సింగిల్ మోటార్ సెటప్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో జత చేయబడి వచ్చింది. అవి 25kWh యూనిట్ మరియు 35kWh యూనిట్. మొదటి బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్ రేంజ్ వెర్షన్‌తో అందుబాటులోకి రాగా, రెండో బ్యాటరీ ప్యాక్ లాంగ్ రేంజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది.
బ్యాటరీ ప్యాక్ | పవర్ అవుట్ పుట్ | ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ రేంజ్ |
25kWh యూనిట్ | 80bhp/114Nm | 315కిమీ |
35kWh యూనిట్ | 120bhp/190Nm | 421కిమీ |
కొత్త టాటా పంచ్ ఈవీ యొక్క వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
స్మార్ట్ - రూ. 10.99 లక్షలు
స్మార్ట్+ - రూ. 11.49 లక్షలు
అడ్వెంచర్ - రూ. 11.99 లక్షలు
అడ్వెంచర్ లాంగ్ రేంజ్ - రూ. 12.99 లక్షలు
ఎంపవర్డ్ - రూ. 12.79 లక్షలు
ఎంపవర్డ్ లాంగ్ రేంజ్ - రూ. 13.99 లక్షలు
ఎంపవర్డ్+ - రూ. 13.29 లక్షలు
ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ - రూ. 14.49 లక్షలు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్