- లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే లభ్యం
- రూ. 8.45 లక్షలతో ధరలు ప్రారంభం
టాటా మోటార్స్ ఇటీవలే బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువిలలో ఒకటైన పంచ్ కామో ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసింది. లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే అందించబడిన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ రూ. 8.45 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఇప్పుడు, లాంచ్ తర్వాత, పంచ్ కామో ఎడిషన్ ఇండియాలోని అన్నీ షోరూమ్‌లకు చేరుకోవడం ప్రారంభమైంది.
కొత్త పంచ్ కామో ఎడిషన్ హైలైట్‌లలో సీవీడ్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ పెయింట్‌తో వైట్ రూఫ్, చార్‌కోల్ గ్రే-ఫినిష్డ్ 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు 'కామో' థీమ్ ప్యాటర్న్‌లతో కూడిన ప్రత్యేకమైన సీట్ అప్హోల్స్టరీ వంటివి ఉన్నాయి.
ఇంకా, 2024 అప్‌డేట్‌తో, టాటా పంచ్ కారు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన పెద్ద 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ మరియు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు ఫ్రంట్ ప్యాసింజర్స్ కోసం సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తోసహా అనేక కొత్త ఫీచర్లను పొందింది.
మెకానికల్‍గా, టాటా పంచ్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి వచ్చింది. ఇందులో సిఎన్‍జివెర్షన్ కూడా అందుబాటులో ఉంది, దీనిని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే కాన్ఫిగర్ చేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప