- ఫియర్ లెస్ వేరియంట్లపై అందించబడుతున్న ఆఫర్లు
- లిమిటెడ్ పీరియడ్ వరకే లభించనున్న సెలెబ్రేటరీ ఆఫర్లు
టాటా మోటార్స్ లేటెస్టుగా ఇండియాలో 20 లక్షల ఎస్యూవీలను విక్రయించి సరికొత్త మైల్ స్టోన్ ని సాధించింది. దీన్ని బట్టి చాలా ఈజీగా చెప్పేయవచ్చు టాటా నుంచి వస్తున్న ఎస్యూవీ కార్లకు ఇండియన్ మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉందో. ఈ మైల్ స్టోన్ ని మరింత ఘనంగా సెలెబ్రేట్ చేయడానికి టాటా బ్రాండ్ పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్ని ఎస్యూవీలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. అదే విధంగా, పాపులర్ మోడల్ నెక్సాన్ పై టాటా కంపెనీ భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా నెక్సాన్ మోడల్ లోని ఏయే వేరియంట్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం.
టాటా నెక్సాన్ కారును వివిధ వెర్షన్లలో స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, మరియు ఫియర్ లెస్ అనే వివిధ వేరియంట్లలో పొందవచ్చు. పైన పేర్కొన్న వేరియంట్లలో, టాప్-స్పెక్ ఫియర్ లెస్ వేరియంట్లపై సెలెబ్రేటరీ ఆఫర్లు అందుబాటులోకి రావడంతో, లిమిటెడ్ పీరియడ్ వరకు వీటిపై ధర తగ్గించబడింది. కింద ఇవ్వబడిన టేబుల్ ద్వారా నెక్సాన్ లోని వివిధ వేరియంట్లపై ఎంత వరకు ధర తగ్గిందో మనం తెలుసుకుందాం.
వేరియంట్లు | పాత ధరలు | కొత్త ధరలు |
పెట్రోల్ ఎంటి | ||
ఫియర్లెస్ | రూ. 12.60 లక్షలు | రూ. 12 లక్షలు |
ఫియర్లెస్ఎస్ | రూ. 13.10 లక్షలు | రూ. 12.50 లక్షలు |
ఫియర్లెస్+ | రూ. 13.10 లక్షలు | రూ. 12.50 లక్షలు |
ఫియర్లెస్+ ఎస్ | రూ. 13.60 లక్షలు | రూ. 13 లక్షలు |
డీజిల్ ఎంటి | ||
ఫియర్లెస్ | రూ. 14 లక్షలు | రూ. 14 లక్షలు |
ఫియర్లెస్ఎస్ | రూ. 14.50 లక్షలు | రూ. 13.90 లక్షలు |
ఫియర్లెస్+ | రూ. 14.50 లక్షలు | రూ. 13.90 లక్షలు |
ఫియర్లెస్+ ఎస్ | రూ. 15 లక్షలు | రూ. 14.40 లక్షలు |
పెట్రోల్ డిసిటి | ||
ఫియర్లెస్ | రూ. 13.80 లక్షలు | రూ. 13.20 లక్షలు |
ఫియర్లెస్ ఎస్ | రూ. 14.30 లక్షలు | రూ. 13.70 లక్షలు |
ఫియర్లెస్ + | రూ. 14.30 లక్షలు | రూ. 13.70 లక్షలు |
ఫియర్లెస్ + ఎస్ | రూ. 14.80 లక్షలు | రూ. 14.20 లక్షలు |
డీజిల్ ఎఎంటి | ||
ఫియర్లెస్ | రూ. 14.70 లక్షలు | రూ. 14.10 లక్షలు |
ఫియర్లెస్ ఎస్ | రూ. 15.10 లక్షలు | రూ. 14.50 లక్షలు |
ఫియర్లెస్ + | రూ. 15.10 లక్షలు | రూ. 14.50 లక్షలు |
ఫియర్లెస్ + ఎస్ | రూ. 15.60 లక్షలు | రూ. 15 లక్షలు |
టేబుల్ లో చూసిన విధంగా, మిగతా వేరియంట్లను మినహాయిస్తే, డీజిల్ టైపులో వచ్చిన ఫియర్లెస్ వేరియంట్లపై ఒకేవిధంగా రూ.60 వేల వరకు ధర తగ్గించబడింది. అంతేకాకుండా, కస్టమర్లు దగ్గరలో ఉన్న టాటా అధికారిక డీలర్ షిప్ ని సందర్శించి రూ.1 లక్ష వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్